వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘోరంగా ఓడింది. దీంతో విండీస్ టూర్‌లో వరుస విజయాలకు బ్రేక్ పడింది. తొలుత బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా తర్వాత బౌలింగ్‌లోనూ తేలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఒబెడ్ మెక్కాయ్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఊరించే షార్ట్ పిచ్ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను మెక్కాయ్ బోల్తా కొట్టించాడు. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బాల్‌కు టెంప్ట్ అయిన రోహిత్ వికెట్ పారేసుకున్నాడు. భారీ షాట్‌కు ప్రయత్నించగా బ్యాక్ వర్డ్ పాయింట్ ఫీల్డర్ అకీల హోస్సెన్ చేతిలో పడింది. ఎక్స్‌ట్రా బౌన్స్ హిట్ మ్యాన్ కొంపముంచింది. దాంతో గోల్డెన్ డక్‌గా భారత కెప్టెన్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ గోల్డెన్ డక్‌తో రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు గోల్డెన్ డకౌట్ అయిన రెండో ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ నాలుగు సార్లు గోల్డెన్ డకౌటై అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆరోన్ ఫించ్, జాసన్ రాయ్‌లు సైతం మూడు సార్లు డకౌటై రోహిత్‌తో సమంగా నిలిచారు. ఇక ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటైన మూడో భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ అప్రతిష్టను మూట కట్టుకొన్నాడు. 2016లో కేఎల్ రాహుల్.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యాడు. ఆ తర్వాత 2021లో శ్రీలకంతో పృథ్వీ షా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే వెనుదిరిగాడు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ చేరాడు.
అలాగే టీ20ల్లో భారత్ తరపున అత్యధిక సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డులో కూడా రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు డకౌట్ అయ్యాడు. అతని తర్వాత కేఎల్ రాహుల్ 4 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆశిష్ నెహ్రా 3, వాషింగ్టన్ సుందర్ 3, యూసుఫ్ పఠాన్ 3, రిషభ్‌పంత్ 3, సురేష్ రైనా 3, విరాట్ కోహ్లీ 3, దినేష్ కార్తీక్ 3 సార్లు టీ20ల్లో డకౌట్ అయ్యారు. ఈ చెత్త రికార్డులో వీళ్లకు అందనంత ఎత్తులో రోహిత్ శర్మ ఉన్నాడు. బ్యాటింగ్ సరిగా రాని టెయిలెండర్ల కంటే కూడా దారుణమైన రికార్డును రోహిత్ కలిగి ఉన్నాడు.
సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం..
రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్టార్మ్ పేసర్‌తో రోహిత్ శర్మకు విడదీయని బంధం ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవ్వడమే రోహిత్ డకౌట్‌కు కారణమని, ఈ మూడు గంటలు రోహిత్ వడాపావ్‌లు లాగించేశాడని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అసలే మ్యాచ్ ఆలస్యం అయిందంటే.. అందులో రోహిత్ ఔటవ్వడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. బ్యాటర్లంతా విఫలయ్యారు. ఒబెడ్ మెక్‌కాయ్ (6/17) సిక్సర్‌తో భారత్ పతనాన్ని శాసించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia put up a solid fight but it was the West Indies who won the second #WIvIND T20I.
We will look to bounce back in the third T20I. 👍 👍
Scorecard 👉 https://t.co/C7ggEOTWOe pic.twitter.com/OnWLKEBiov
— BCCI (@BCCI) August 1, 2022
2ND T20I. WICKET! 0.1: Rohit Sharma 0(1) ct Akeal Hosein b Obed McCoy, India 0/1 https://t.co/OuXkk4FoU5 #WIvIND
— BCCI (@BCCI) August 1, 2022
ఇది కూడా చదవండి: చెత్త షాట్.. పంత్ అవుట్ పై రోహిత్ రియాక్షన్!