ఇండియన్ క్రికెట్ హిస్టరీలో విరాట్ కోహ్లీ స్థానం ప్రత్యేకమైనది. టీమ్ లో ఆటగాడిగా, కెప్టెన్ గా విరాట్ ప్రయాణం అద్భుతం అనే చెప్పుకోవాలి. కానీ.., గత కొన్ని నెలల కాలంలో కోహ్లీకి కష్టాలు మొదలయ్యాయి. అన్నీ ఫార్మెట్స్ లో కెప్టెన్సీ పోయింది. పైగా.., ఫామ్ కోల్పోయాడు. ఇదే సమయంలో తాను పోటీగా భావించే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా మారాడు. ఇలా ఏ విధంగా చూసుకున్నా కోహ్లీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక తాజాగా కోహ్లీ బ్యాడ్ ఫామ్ పై రోహిత్ శర్మ సంచలన కామెంట్స్ చేశాడు.
“విరాట్ చాలా సీనియర్ ఆటగాడు. క్లిష్ట సమయాన్ని ఎలా అధిగమించాలో అతడికి బాగా తెలుసు. మీడియా చేస్తున్న అనవసరపు రాద్ధాంతం తప్పించి, కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి లేదు. అతని ఫామ్ పై లేనిపోని చర్చలు కూడా అవసరం లేదు. కొన్ని రోజులు కోహ్లీని అలానే వదిలేసి, మౌనంగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి. టీమిండియా అన్నీ వ్యూహాల్లో కోహ్లీ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇకనైనా అతనికి కాస్త సమయం ఇవ్వండి అంటూ రోహిత్ కామెంట్స్ చేశాడు.
#Rohitsharma on #ViratKohli in Pc.🔥🔥🇮🇳🇮🇳.This shows the respect between them 🤗🤗 pic.twitter.com/vsGMmlw5WU
— Abhisek (@Abhisek099) February 11, 2022
తాజాగా ముగిసిన వెస్టిండీస్ వన్డే సీరిస్ లో కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. మొత్తం మూడు వన్డేలలో కలిపి విరాట్ కేవలం 26 పరుగులే చేశాడు. ఇక కోహ్లీ సెంచరీ చేసి కూడా రెండేళ్ల పైనే కావస్తోంది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.