ఉప్పల్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 6 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ మధ్య మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో సరదాగా డీకే గొంతును రోహిత్ శర్మ పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మ్యాచ్‌లో డీకేకు రోహిత్ ముద్దు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు ఓపెనర్ గ్రీన్ ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫించ్ త్వరగానే అవుటైనా గ్రీన్ మాత్రం పవర్‌ప్లేలో టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కానీ.. పవర్‌ప్లే తర్వాత భారత్ బౌలర్లు పుంజుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసకున్న గ్రీన్‌ను భువీ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్ అనూహ్యమైన రీతిలో అవుటైయ్యాడు.
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్ వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. బౌండరీ వద్ద అద్భుతంగా బాల్ అందుకున్న అక్షర్ పటేల్.. స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ విసిరాడు. డైరెక్ట్ త్రో తగలడంతో రెండో పరుగు కోసం ప్రయత్నించిన మ్యాక్స్‌వెల్ రనౌట్ అయ్యాడు. కానీ.. ఇక్కడే ట్విస్ట్. బాల్ చేతుల్లోకి రాకముందే.. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ గ్లవ్స్ తగిలి ఒక బెయిల్ కిందపడింది. ఆ తర్వాత బాల్ నేరుగా వచ్చి వికెట్లకు తాకడంతో రెండో బెయిల్ కూడా లేచింది. మరి ఇది అవుటా నాటౌటా అనే సందేహం అందరిలో వ్యక్తమైంది. గ్లవ్స్ తగిలి ఒక బెయిల్ పడిపోయినా.. మరో బెయిల్ బాల్ తగిలిన తర్వాత పడటంతో రూల్స్ ప్రకారం అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో మ్యాక్స్‌వెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
కాగా.. త్రో రాకముందే డీకే వికెట్లను తన గ్లవ్స్‌తో పడేయటం రోహిత్‌కు చిరుకోపం తెప్పించింది. రెండో బెయిల్ బాల్ తగిలి పోడిపోవడంతో మ్యాక్సీ అవుట్ అయ్యాడు. అలా కాకుండా గ్లవ్స్ తగిలి రెండు బెయిల్స్ తగిలి పడిపోయి ఉంటే అతను నాటౌట్‌గా ఉండేవాడు. డీకే అదృష్టం కొద్ది అలా జరగలేదు. ఇదే విషయంపై డీకేతో మాట్లాడుతూ.. బతికిపోయవు పో అంటూ రోహిత్ డీకే హెల్మెట్‌కు ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి మ్యాచ్‌లో అప్పీల్ చేయడం లేదని డీకేపై కోపంతో సరదాగా గొంతుపట్టుకున్న రోహిత్ రెండో మ్యాచ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించిన డీకేను ఆనందంతో కౌగిలించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ క్రమక్రమంగా కూల్‌గా మారిపోతున్నాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మీరు మారిపోయారు సార్ అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. మరి రోహిత్ డీకేను ముద్దు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This keeps getting better! 😅
📸: BCCI | @DineshKarthik @ImRo45 #INDvAUS pic.twitter.com/gm49N6ueKx
— KolkataKnightRiders (@KKRiders) September 25, 2022
ఇది కూడా చదవండి: మ్యాక్సీ రనౌట్‌పై సర్వత్రా చర్చ.. అది ఔటా- నాటౌటా?