టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పనితో ఓ అభిమాని రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో సదరు అభిమాని వీడియో వైరలవుతోంది. మరి ఇంతకు రోహిత్ శర్మ ఏం చేశాడు అంటే..
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అభిమానులతో ఎంత కూల్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానం వెలుపలా, బయటా చాలా కూల్‌గా, సరదాగా ఉంటాడు. తనతో సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపే అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపరచడు. ఎంతో సహనంగా వారితో సెల్ఫీలు దిగుతూ.. అభిమానుల పట్ల తన ప్రేమను చాటుకుంటాడు రోహిత్ శర్మ. ఇక తాజాగా విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించిన ఓ ఫ్యాన్‌కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా రెండో వన్డే జరిగింది. బామ్మర్ది పెళ్లి పనులతో ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేకు దూరంగా ఉన్నా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో రెండో వన్డేలో పాల్గొనడం కోసం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నాడు రోహిత్. ఇక టీమిండియా క్రికెటర్లు వస్తున్నారనే విషయం తెలిసి.. ఓ అభిమాని.. వారిని తన సెల్‌ఫోన్‌లో బంధించేందుకు ప్రయత్నించాడు. సదరు అభిమాని చేస్తోన్న పని గమనించిన రోహిత్ శర్మ.. అతడికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దాంతో ఆ వ్యక్తి ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యాడు.
ఇక సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్న అభిమాని దగ్గరకు వెళ్లిన రోహిత్ శర్మ.. ఊహించని రీతిలో.. తన చేతిలో ఉన్న గులాబీ పువ్వును తీసి.. అభిమానికి ఇచ్చాడు. అంతటితో ఆగక.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ చిలిపిగా ప్రపోజ్ చేసి అక్కడ నుంచి చక్కా వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ రోహిత్ శర్మ ప్రపోజ్ చేసింది ఓ మేల్ ఫ్యాన్‌కి. హిట్ మ్యాన్ తన దగ్గరకు రావడమేకాక.. చేతిలో గులాబీ పెట్టి ఏకంగా ప్రపోజ్ చేయడంతో.. ఆ అభిమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తేరుకున్న తర్వాత అతడి సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. సదరు అభిమాని రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు.
ఇక రోహిత్ శర్మకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి పూర్ణిమ శర్మ విశాఖపట్నానికి చెందిన వారు. దాంతో రోహిత్‌కు విశాఖతో అనుబంధం ఉంది. ఇక విశాఖ వన్డే ఫలితాల విషయానికి వస్తే.. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ సెలక్ట్ చేసుకున్న టీమిండియా.. మిచెల్ స్టార్క్ (5/53) దెబ్బకు 117 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష చేధన కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా క్రికెటర్లు.. కేవలం 11 ఓవర్లలోనే.. 10 వికెట్ల తేడాతో ఇండియా మీద విజయం సాధించింది. మరి రోహిత్ శర్మ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma is an amazing character – what a guy! pic.twitter.com/YZzPmAKGpk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2023