టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి గాయపడ్డాడు. భారత్-వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ అనూహ్యంగా రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తన ట్రేడ్‌మార్క్ పుల్ షాట్‌తో సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. ఆ వెంటనే బౌండరీ బాది జోరు కనబర్చాడు. ఆ మరుసటి బంతికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
అంతకుముందు రెండు బంతులను లెగ్ సైడ్ స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించిన రోహిత్‌కు వీపు కండరాలు పట్టేసినట్లు అనిపించింది. తొడ కండరాల గాయం కూడా తిరగబెట్టినట్లుంది. దాంతో కాస్త అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. కొద్దిసేపటికే నొప్పితో అల్లాడిపోయాడు. శరీరాన్ని బలంగా తిప్పడంతో ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఫిజియోలు అతన్ని పరీక్షించి మైదానం బయటకు తీసుకెళ్లారు. దాంతో రోహిత్ 5 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. అయితే రోహిత్‌కు మరింత విశ్రాంతి అవసరమని సమాచారం.
దీంతో విండీస్‌తో మిగిలిన రెండు టీ20లకు రోహిత్ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు గాయాలపాలైన రోహిత్‌కు పాత గాయం తిరగబెట్టడం పెద్ద సమస్యగా మారింది. పైగా ఈ సిరీస్ తర్వాత ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్న నేపథ్యంలో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చేందుకే టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా.. రోహిత్ స్థానంలో కీపర్ రిషభ్ పంత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#INDvWI #RohitSharma@ImRo45 retires hurt with back muscle pull in third T20I
READ: https://t.co/Ac8oOUoSkI pic.twitter.com/jhoP5jCv3U
— TOI Sports (@toisports) August 2, 2022
ఇది కూడా చదవండి: ఆ షాట్‌తో సచిన్‌ను గుర్తుకు తెచ్చిన సూర్యకుమార్ యాదవ్!