టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను ఇండియా పాకెట్‌లో పెట్టగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒక బౌలర్ విషయంలో మాత్రం బోల్తాకొడుతున్నాడు. శ్రీలంక యువ పేసర్ దుష్మంత చమీరా బౌలింగ్‌లో రోహిత్ శర్మ తడబడుతున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటికే అతని బౌలింగ్‌లో ఏకంగా 6 సార్లు అవుట్ అయ్యాడు. టీ20 క్రికెట్‌లో ఇదే ఇప్పటి వరకు రికార్డు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా రెండు, మూడో మ్యాచ్‌లలో రోహిత్ శర్మ చమీరా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. గతంలో రెండు నాలుగు సార్లు చమీరానే రోహిత్‌ను పెవిలియన్‌కు పంపాడు.
తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న చమీరాను ఇటివల ఐపీఎల్ వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై, లక్నో మ్యాచ్ సందర్భంగా కూడా చమీరా వర్సెస్ రోహిత్ వర్మ బ్యాటిల్‌ను చూడొచ్చు. మరి ఇప్పటి వరకు చమీరా రోహిత్‌పై పైచేయి సాధించగా.. ఐపీఎల్‌లో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చలాయిస్తారో చూడాలి. మరి చమీరా, రోహిత్ బ్యాటిల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma Vs Chammera
32 runs, 6 outs, 5.3 avg in t20isChameera gurunath Sharma pic.twitter.com/GkNyeDW0qQ
— Gaurav (@Kohli4ever) February 27, 2022
Rohit Sharma is gone ☝️
Dushmantha Chameera dismisses him again!
The Indian skipper is gone for 5. #INDvSL | 📝 https://t.co/x2kKwmYSlk pic.twitter.com/NM8teZ8lkV
— ICC (@ICC) February 27, 2022