ఆస్ట్రేలియాతో తొలి టీ20లో టీమిండియా ఓడిపోయింది. భారీ స్కోరు చేసినా సరే ఫలితం లేకుండా పోయింది. భారత జట్టుపై పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలా అంతా రచ్చ రచ్చ అవుతుంది. ఇవన్నీ పక్కనబెడితే ఈ మ్యాచులో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. మరీ ముఖ్యంగా 12 ఓవర్ లో జరిగిన ఓ సంఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీ చూస్తున్న వాళ్లు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల స్కోరు చేసింది. దీంతో ఆసీస్ బ్యాటర్లు.. ప్రారంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఓపెరన్ గా వచ్చిన యంగ్ క్రికెటర్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక స్మిత్ కూడా తన అలవాటైన స్టైల్లో ఆడుతూ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఓ సమయంలో అయితే ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేశాడు. దెబ్బకి అందరూ స్టన్ అయిపోయారు.
12 ఓవర్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్.. తొలి రెండు బంతుల్ని 4,6 కొట్టిన స్మిత్.. యార్కర్ గా వచ్చిన మూడో బంతిని తొలుత స్కూప్ షాట్ ఆడాలని అనుకున్నాడు. చివరి నిమిషంలో మనసు మార్చుకుని థర్డ్ మ్యాన్ వైప్ ఆడాలని చూశాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి.. కీపర్ దినేశ్ కార్తిక్ చేతిలో పడింది. భారత ఆటగాళ్లు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ.. రివ్యూకి వెళ్లాడు. అది వచ్చేలోపు.. స్మిత్ దగ్గరికి వెళ్లి బ్యాట్ తాకలేదా అని అడగ్గా.. లేదు తాకలేదని స్మిత్ ఆస్కార్ లెవల్ ఫెర్మామన్స్ ఇచ్చాడు. తీరా చూస్తే.. థర్డ్ అంపైర్ దాన్ని ఔట్ గా ప్రకటించాడు. దీన్ని చూసిన నెటిజన్స్.. స్మిత్ ని ట్రోల్ చేస్తున్నారు. మరి స్మిత్ ఔట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
— Hardin (@hardintessa143) September 21, 2022
ఇదీ చదవండి: తీరుమారని టీమిండియా.. మళ్లీ ఆ తప్పులే కొంపముంచాయి..