ఐపీఎల్-2022లో తొలి మూడు మ్యాచ్‌లలోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒకింత అసహనానికి గురయ్యాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచే మ్యాచ్ ఓడిపోవడంతో రోహిత్ శర్మ చాలా కోపంగా కనిపించాడు. మ్యాచ్ అనంతరం పోస్టు మ్యాచ్ ఇంటర్వ్యూలో చాలా చిరాగ్గా ‘సౌండ్ పెంచండి అంటూ’ విసుక్కున్నాడు. రోహిత్ శర్మను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రోహిత్ విసుక్కున్న వీడియోపై కామెంట్ చేస్తున్నారు.
కేకేఆర్‌తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ మినహా మిడిలార్డర్ విఫలం కావడంతో విజయం తమదే అన్న ధీమాతో ఉన్న ముంబై ఇండియన్స ప్లేయర్లు ఉన్నారు. కానీ ప్యాట్ కమిన్స్ విధ్వంసం సృష్టించి ఒకే ఓవర్‌లో మ్యాచ్‌ను లాక్కున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 15 బంతుల్లోనే ఏకంగా 56 పరుగులు సాధించాడు. తద్వారా కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్ డేనియల్ సామ్స్ బౌలింగ్‌ను చీల్చిచెండాడి ఒకే ఓవర్లో 35 పరుగులు పిండుకుని ముంబైకి చేదు అనుభవం మిగిల్చాడు. ఇలా ఊహించని ఓటమితో రోహిత్ శర్మ తీవ్ర నిరాశకు గురై అలా ప్రవర్తించాడు. మరి రోహిత్ కోపంపై మీ అభిప్రాయానలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తెలుగోడు తిలక్ వర్మ కొట్టిన సిక్స్‌కు కళ్లు తేలేసిన కమిన్స్
First time saw Rohit getting emotional in post match presentation. 😞💔
Man you guys have won 5 trophies for us.🙌👑💙#kkrvmi #RohitSharma #MumbaiIndians pic.twitter.com/bjtnYdQOHp— Saurabh Raghav 🇮🇳 (@TheRohitianboy) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.