అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కంటే ముందు టాస్ వేస్తారనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరు ముందుగా బ్యాటింగ్ చేయాలో? ఫీల్డింగ్‌కు దిగాలో కాయిన్ టాస్‌తోనే నిర్ణయిస్తారు. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం వచ్చి.. గెలిచిన వారు బ్యాటింగో.. ఫీల్డింగో ఎంచుకుంటారు. కానీ.. టాస్‌కు వెళ్లడానికి కంటే ముందే.. టీమ్‌లో ముందుగా ఏం చేయాలనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. పిచ్ కండీషన్, గత రికార్డులు, వాతావరణ పరిస్థితులను బట్టి.. ముందుగా బ్యాటింగ్ చేయాలా? లేక ఫీల్డింగ్ ఎంచుకుని ఛేజింగ్ చేయాలా? అనే విషయం గురించి కెప్టెన్, కోచ్, ఆటగాళ్ల మధ్య టీమ్ మీటింగ్ జరిగిన తర్వాత అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి.. టాస్ గెలిస్తే.. ఈ ముందుగా బ్యాటింగో, ఫీల్డింగో చేయాలని నిర్ణయం తీసుకుంటారు.
అనుకున్నట్లు ఆ టీమ్ కెప్టెనే టాస్ గెలిస్తే.. టీమ్ మీటింగ్‌లో అనుకున్న నిర్ణయం ప్రకారం ఏం చేయాలో ఎంచుకుంటారు. చాలా సందర్భాల్లో టాస్ ఎంతో కీలకంగా మారుతుంది. రెండు సమవుజ్జీలు తలపడినప్పుడు టాస్ గెలిచిన టీమ్ మ్యాచ్ గెలిచిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఆసియా కప్ 2022లో టీమిండియా వైఫల్యానికి కారణం టాసే అనేది అందరికి తెలిసిన విషయం. అందుకే.. టాస్ ఎంత కీలకమో కెప్టెన్లకు బాగా తెలుసు. అందుకే.. టాస్ సమయంలో ఏం తీసుకోవాలనే దానిపై టీమ్ మీటింగ్‌లో చర్చించి.. గెలిస్తే ఏం తీసుకోవాలనే దానిపై ఒక పక్కా నిర్ణయంతో టాస్ కోసం వస్తారు కెప్టెన్లు. కానీ.. ఆశ్చర్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. టాస్ గెలిచిన తర్వాత.. ఏం ఎంచుకోవాలో మర్చిపోయానని, దీని కోసం టీమ్ మీటింగ్‌లో చాలా చర్చించాం కానీ.. నాకు గుర్తులేని టాస్ గెలిచిన తర్వాత చెప్పి.. అందరిని షాకిచ్చాడు.
టీమ్ విజయం కోసం ఎంతో కసితో ఉండే రోహిత్ శర్మ నుంచి ఇలాంటి కామెంట్ రావడంతో క్రికెట్ అభిమానులతో పాటు, క్రికెట్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. టీమ్‌కు ఒక ఛాలెంజ్ విసరడం కోసం తాను తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు తెలిపాడు రోహిత్. కఠిన పరిస్థితుల్లో, ఒత్తిడిని తట్టుకుంటూ.. ఎలా ఆడాలనే ఛాలెంజ్‌ను తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. హైదరాబాద్‌లో తాము తొలుత బ్యాటింగ్ చేసి గెలిచాం.. అందుకే ఇప్పుడు ఫీల్డింగ్ చేస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. మరి టాస్ తర్వాత.. ఏం ఎంచుకోవాలనే విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మర్చిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv
— BCCI (@BCCI) January 21, 2023