రోహిత్ శర్మ అలియాస్ హిట్‌మ్యాన్ తాజాగా ఓవల్ స్టేడియంలో నాలుగో టెస్టులో శతకం బాదిన విషయం తెలిసిందే. 2013 సంవత్సరం టెస్టుల్లో అరంగేట్రం చేసినా ఇప్పటివరకు రోహిత్ శర్మ విదేశాల్లో శతకం బాదలేదు. ఇదే హిట్‌మ్యాన్‌కు తొలి ఓవర్‌సీస్ శతకం కావడం విశేషం. మొత్తం 256 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో రోహిత్ శర్మ 127 పరుగులు సాధించాడు. అందరూ రోహిత్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయారు. కానీ, ఆ శతకం సాధించడం వెనుక రోహిత్ మైదానంలో పడ్డ కష్టం గురించి తెలుసుకుని అభిమానులు చాలా బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేశాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అసలు విషయం ఏంటంటే.. రోహిత్ శర్మ ఓవల్ మైదానంలో కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అప్పుడు ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. కానీ, తాజాగా రోహిత్ శర్మ పరిస్థితి గురించి ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో రోహిత్ శర్మ తొడ భాగమంతా ఎర్రగా కమిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేశాడని తెలుసుకుని అందరూ భావోద్వేగానికి లోనవుతున్నారు. హిట్‌మ్యాన్ గాయాలను యుద్ధంలో ఏర్పడిన గాయాలుగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అందరూ రోహిత్ అంకితభావానికి ఫిదా అయిపోయారు.