ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు దెబ్బ మీద దెబ్బపడింది. ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. రోహిత్ రాణించి, మంచి స్కోర్ చేసినా ఓటమి తప్పలేదు. అప్పటికే ఓటమి భారంతో ఉన్న రోహిత్ శర్మపై జరిమానా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించేలా మొదట్లో కనిపించాలేదు. కానీ మ్యాచ్ గడిచే కొద్ది వికెట్లు పడుతున్న లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. దీంతో ఢిల్లీ బ్యాటర్లను కంట్రోల్ చేయడానికి రోహిత్ శర్మ బౌలర్లలతో తీవ్రంగా చర్చలు జరిపాడు. ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ.. చివరి ఓవర్లలో ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించారు.
రోహిత్ శర్మ బౌలర్లతో ఎన్ని చర్చలు జరిపినా అవి ఫలితాన్ని ఇవ్వలేదు. మ్యాచ్‌లో బౌలర్లతో ఎక్కువగా చర్చలు జరిపిన రోహిత్ శర్మ.. మ్యాచ్ సమయాన్ని వృథా చేశాడు. దాంతో.. ముంబై ఇండియన్స్ టీమ్‌కి కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్‌ని తక్కువగా వేసింది. ఈ క్రమంలో స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద కెప్టెన్ రోహిత్ శర్మకి రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా అతనికి ఇది తొలి తప్పిదం కావడంతో.. రూ.12 లక్షలే పడింది. రిపీట్ అయితే.. జరిమానా రెట్టింపుకానుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్ మారినా.. RCB తలరాత మారలేదు! ఇంత బ్యాడ్ లక్ కి కారణం?
मुंबईची spirit 👊
“We made some mistakes on the field which didn’t go according to plans. But those things can happen.” – @ImRo45 #OneFamily #DilKholKe #MumbaiIndians pic.twitter.com/IZhDPtHWkY
— Mumbai Indians (@mipaltan) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.