ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. తొలి రెండు టెస్టుల్లో ఏ ఎంత గొప్పగా గెలిచిందో మూడో టెస్టులో అంత చెత్తగా ఓడింది. మరి ఈ ఓటమికి కారణాలను జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు కేవలం 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చాలా సింపుల్ గానే టార్గెట్ ఛేదించింది. టీమిండియా ఏమైనా అద్భుతం చేస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. తొలి ఓవర్లోనే అశ్విన్.. ఆసీస్ ఓపెనర్ ఖవాజా వికెట్ తీసి భారత శిభిరంలో చిన్నపాటి ఆశ రేపినా.. ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ జట్టు ఓపెనర్ హెడ్, లబుషేన్ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరొక వికెట్ పడకుండా ఆసీస్‌కి గెలుపును అందించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఓటమిపై స్పందించాడు.
రోహత్ మాట్లాడుతూ.. ‘తొలి ఇన్నింగ్స్ లో మేము బాగా బ్యాటింగ్ చేయలేదు. ఇదే మా టీం ఓటమికి ప్రధాన కారణం. దీనితో ఆసీస్ కి తొలి ఇన్నింగ్స్ లో 88 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఒక టీం కి 80-90 పరుగులు ఆధిక్యం ఎంతో విశ్వాసాన్ని ఇస్తుంది. ఈ విషయం మాకు అర్ధం అయింది. అందుకే రెండో ఇన్నింగ్స్ లో మేము కచ్చితంగా బాగా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మేము ఆడలేకపోయాం. దీంతో కేవలం 75 పరుగుల లీడ్ మాత్రమే సాధించాం. అక్కడే మా ఓటమి ఖరారైంది. తొలి ఇన్నింగ్స్ లో మా జట్టు బాగా బ్యాటింగ్ చేసి ఉంటె ఫలితం వేరేలా ఉండేది. ఆసీస్ స్పిన్నర్లు ఈ టెస్టులో మాకు ఛాలెంజింగా బంతులు విసిరారు.
మేము కొంచెం ధైర్యంగా బ్యాటింగ్ చేసి ఆడాల్సింది. ముఖ్యంగా లియాన్ సరైన లెంగ్త్ లో బౌలింగ్ వేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. ఈ క్రెడిట్ అంతా ఆసీస్ స్పిన్నర్లకు ఇవ్వాలి. కానీ మేము తొలి రెండు టెస్టుల్లో బ్యాటింగ్ బాగానే చేశామని చెప్పాలి. పిచ్ ఎలాంటిదయినా మన ఆలోచన గెలుపు మీదే ఉండాలి. ఇలాంటి సవాళ్లతో కూడుకున్న వికెట్ పై ఆడాలంటే కొంచెం ధైర్యం ప్రదర్శించాలి. కానీ మా జట్టులో అలా ఎవరూ చేయలేకపోయారు. ఈ మ్యాచ్ ముగిసే వరకు డబ్ల్యూటీసి ఫైనల్ గురించి నాకు ఎలాంటి ఆలోచన లేదు. నా దృష్టి అంతా ఈ మ్యాచ్ ఎలా గెలవాలనే దాని మీదే ఉంది. మా తప్పులను తెలుసుకొని తర్వాత టెస్టులో బరిలోకి దిగుతాం.’ అని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలియజేశాడు. మరి కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s how Steve Smith, Rohit Sharma, and Nathan Lyon reacted after Australia’s remarkable victory over India in the third BGT Test.#CricTracker #INDvAUS #BGT pic.twitter.com/9PGCZcFWdi
— CricTracker (@Cricketracker) March 3, 2023