టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి వారే కారణమంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
విశాఖపట్నం వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు దారుణంగా కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ 29 రన్స్‌తో కొద్ది సేపు పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్లంతా అత్యంత దారుణంగా విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరో సారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా వెంటవెంటనే వికెట్లు పడటంతో భారత్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. 26 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఈ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఓటమితో తీవ్ర నిరాశ చెందినట్లు పేర్కొన్నాడు.
తమ జట్టు బ్యాటింగ్ సరిగా చేయని కారణంగానే ఓడిపోయినట్లు పేర్కొన్నాడు. బ్యాటర్లు సరిగా ఆడలేదని అన్నాడు. ఆస్ట్రేలియాకు టఫ్ టార్గెట్‌ను ఇవ్వలేకపోయామని, బోర్డుపై సరిపోయినంత రన్స్ లేకపోతే, బౌలర్లు మాత్రం ఏం చేస్తారని పేర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం, ఒక్క బలమైన పార్ట్నర్‌షిప్ కూడా లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని అన్నాడు. ఈ పిచ్‌పై 117 పరుగులు చాలా చిన్న స్కోర్, మేము సరిగా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని తెలిపాడు. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాత తాను కోహ్లీ కలిసి వేగంగా 30 పరుగులు ఓడించిన తర్వాత.. తన వికెట్ పడటం పెద్ద ఎదురుదెబ్బ అని రోహిత్ పేర్కొన్నాడు.
తాను అవుట్ అయిన వెంటనే వికెట్లు వెంటవెంటనే పడ్డాయని, అలాగే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. అలాంటి క్వాలిటీ బౌలింగ్‌నే స్టార్క్ చాలా ఏళ్లుగా చేస్తున్నాడని, బాల్‌ను స్వింగ్ చేస్తూ.. తమను ఇబ్బంది పెట్టినట్లు రోహిత్ వెల్లడించాడు. బాల్ లోపలికి వస్తుందా? బయటికి వెళ్తుందా అనే విషయాన్ని తాము ప్రతి బాల్‌కు గమనించాల్సి వచ్చిందని తెలిపాడు. ఏది ఏమైనా తమ బ్యాటర్ల వైఫ్యలమే ఈ ఓటమికి కారణంగా రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం చెన్నైలో జరిగే మూడో వన్డేలో ఎవరు గెలిస్తే.. వారే సిరీస్ విజేతలుగా నిలుస్తారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన, రోహిత్ చెప్పిన కారణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma choked again in ball swinging condition – 😂
Flat track bully is finished without highways! pic.twitter.com/83oMGOOweN
— Vishal. (@SportyVishaI) March 19, 2023