ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టెస్టుకు ముందు క్లబ్ జట్టుతో టీమిండియా ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అతను క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఇంగ్లండ్‌కు కుటుంబంతో పాటు వెళ్లిన రోహిత్.. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడటంతో అతనితో భార్య రితికా, కూతురు సమైరా దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో రోహిత్ గారాలపట్టి సమైరా నాన్నను ఎంతో మిస్ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇంగ్లండ్‌లో వాళ్లు బస చేస్తున్న హోటల్ నుంచి తల్లి రితికాతో కలిసి సమైరా బయటికి వెళ్తున్న సమయంలో ఎవరో తనతో మాట్లాడుతూ.. మీ నాన్నా ఎక్కడా అని అడగ్గా.. ‘మా నాన్నకు కరోనా వచ్చింది. రూమ్‌లో ఒక్కరే ఉన్నారు. ఒక నెల పాటు అలానే ఉంటారంటా’ అంటూ చెప్పింది. ఈ చిన్నారి మాటలు విన్న నెటిజన్లు.. పాపం చిట్టితల్లి వాళ్ల నాన్న ఎంత మిస్ అవుతుందో.. అంటూ క్రయింగ్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. నిజానికి రోహిత్ శర్మ కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తాడు. క్రికెట్ నుంచి విశ్రాంతి దొరికితే కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. దీంతో తన గారాలపట్టి సమైరాకు నాన్నే ప్రపంచం. ఇప్పుడు కరోనా కారణంగా.. రోహిత్ క్వారంటైన్‌లో ఉండడంతో కనీసం కూతుర్ని దగ్గరకు తీసుకునే పరిస్థితి లేదు. దీంతో సమైరా నాన్నను ఎంతో మిస్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమైరా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊🇮🇳 (@Krishna19348905) June 27, 2022