ఆసిస్ తో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దాంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీమిండియా ఓటమికి 'అతి విశ్వాసమే' కారణం అన్న రవిశాస్త్రి వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది టీమిండియా. దాంతో రెండు టెస్ట్ ల్లో ఘన విజయాలు సాధించి మంచి ఊపుమీదుంది. అయితే మూడో టెస్ట్ ను కూడా గెలుచుకుని సిరీస్ ను కైవసం చేయాలనుకున్న భారత ఆశలపై ఆసిస్ నీళ్లు చల్లింది. మూడో టెస్ట్ లో అనూహ్యంగా పుంజుకున్న ఆసిస్ భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దాంతో ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే టీమిండియాపై విమర్శలు గుప్పించాడు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి. అతి విశ్వాసమే భారత్ కొంప ముంచింది అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఘాటుగా స్పందించాడు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ.
ఆసిస్ తో జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా ఓటమికి కారణం అతి విశ్వాసమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి మ్యాచ్ అనంతరం కామెంటరీ బాక్స్ నుంచి వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. బయటి వ్యక్తులు చేసే ఇలాంటి చెత్త వ్యాఖ్యలను మేం పట్టించుకోం అని రోహిత్ అన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మరింతగా స్పందిస్తూ..”నిజాయితీగా చెప్పాలంటే మేం తొలి రెండు టెస్టు లు గెలిచాం. అయితే ఆ గెలుపుని బయటి వ్యక్తులు అతి విశ్వాసం అంటున్నారు. ఆ వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయి. ఎందుకుంటే ఏ జట్టు అయినా ఉత్తమ ప్రదర్శన ఇచ్చి, విజయం సాధించడానికే చూస్తాయి. ఇక అతి విశ్వాసం అని చెప్పే వాళ్లకు డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి వారు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు” అని రోహిత్ కాస్త ఘాటుగానే స్పందించాడు.
ఇక మేం అన్ని మ్యాచ్ ల్లో మంచి ప్రదర్శన ఇవ్వాలనే చూస్తామని, అలాంటప్పుడు బయటి వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోం అని రోహిత్ అన్నాడు. ఇక ఇండియా-ఆసిస్ మధ్య చివరిదైన నాలుగో టెస్ట్ గురువారం(మార్చి 9) నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మరి రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై రోహిత్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.