భారత్-బంగ్లాదేశ్ రెండో వన్డే చూసిన ఎవరికైనా సరే మెంటలెక్కిపోయి ఉంటుంది. ఎందుకంటే చివరివరకు నరాలు తెగే ఉత్కంఠతో హోరాహోరీగా మ్యాచ్ సాగింది. గాయమైనా సరే కెప్టెన్ రోహిత్ శర్మ.. అదిరిపోయే బ్యాటింగ్ చేయడం, ఆల్మోస్ట్ గెలిపించేసినంత వరకు మ్యాచ్ ని తీసుకురావడం టీమిండియా ఫ్యాన్స్ కు చాలా హై ఇచ్చింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించి ఉండొచ్చు గానీ.. స్టేడియంతో పాటు మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరి మనసులు గెలిచింది మాత్రం భారత జట్టే. ఇక ఈ మ్యాచులోని ఓ సందర్భంలో బంగ్లాదేశ్ క్రికెటర్లని, ఓ అభిమాని బండ బూతులు తిట్టాడు. ఆ విజువల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢాకా వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో 12 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. మహ్మదుల్లా బౌలింగ్ చేస్తున్నాడు. స్టేడియంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం జరుగుతుందా అని ఒకటే టెన్షన్ లో ఉన్నారు. ఇక ఈ ఓవర్ లో రోహిత్.. వరసగా 6, 2(వైడ్), 2, 6, 2, 1 చేశాడు. చివరి బౌల్ కు సిరాజ్ ఔటయ్యాడు. అయితే రోహిత్ ఇచ్చిన రెండు క్యాచుల్ని బంగ్లా ఆటగాళ్లు ఇబాదత్, బిజోయ్ వదిలేశారు. దీంతో పలువురు అభిమానులు.. వాళ్లని బండబూతులు తిడుతూ కనిపించారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
అయితే టార్గెట్ ఛేజ్ చేస్తున్నప్పుడు, అది కూడా చివరి ఓవర్లు అంటే చాలా టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది. అది బ్యాటర్లకు కావొచ్చు, గ్రౌండ్ లోని ఫీల్డర్స్ కు కావొచ్చు చాలా ఒత్తిడితో ఉంటారు. ఇక క్రీజులో రోహిత్ లాంటి అద్భుతమైన బ్యాటర్ ఉండేసరికి బంగ్లా ఫీల్డర్లు మరింతి ఒత్తిడికి లోనైనట్లు కనిపించారు. ఈ క్రమంలోనే రోహిత్ ఇచ్చిన సులభమైన క్యాచుల్ని జారవిడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వరసగా రెండు వన్డేల్లోనూ ఓడిపోయిన భారత జట్టు.. సిరీస్ ని బంగ్లా జట్టుకు సమర్పించింది. ఇక నామమాత్ర చివరి వన్డే.. శనివారం జరగనుంది. దీని తర్వాత టీమిండియా-బంగ్లాదేశ్ రెండు టెస్టులు ఆడతాయి. మరి బంగ్లా ఆటగాళ్లను.. వాళ్ల దేశ అభిమానులే తిట్టడం చూసి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
An innings with broken thumb – Rohit Sharma almost did it. pic.twitter.com/uQv5E4matN
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2022