హిట్ మ్యాన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు బ్యాట్స్‌మన్‌గా.. ఓపెనర్‌గా మాత్రమే సేవలందించిన హిట్‌మ్యాన్ ఇప్పుడు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విండీస్‌తో జరగనున్న తొలి వన్డే టీమిండియాకు 1000వ మ్యాచ్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు వన్డేల్లో వెయ్యి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్న రోహిత్ శర్మ.. తన కెప్టెన్సీలో జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోను షేర్ చేస్తూ.. ”ప్రారంభానికి ముందు ఈ నిరీక్షణను తట్టుకోలేకపోతున్నా..” అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0తో ఓడిపోయింది. రోహిత్ గైర్హాజరీలో తొలిసారి కెప్టెన్‌గా విధులు నిర్వర్తించిన కేఎల్ రాహుల్‌కు పీడకలగా మిగిలిపోయింది. అయితే విండీస్‌తో సిరీస్ టీమిండియా తన సొంతగడ్డపై ఆడుతుండడంతో మరోసారి ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక అందరికళ్లు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత మంచి ఇన్నింగ్స్‌లతో ఫామ్‌లోనే కనిపిస్తున్న కోహ్లి ఈ సిరీస్‌లోనైనా సెంచరీ చేస్తాడా లేదా అని ఎదురుచేస్తున్నారు. ఇక మొదట మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్న విండీస్.. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 3-2 తేడాతో గెలిచిన విండీస్ ఆత్మవిశ్వాసంతో టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది. రోమిత్ వర్మ టీమిండియాను విజయవంతంగా నడిపిస్తాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.