స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 సిరీస్ కు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 20న మొహాలీలో జరగనుంది. ఇప్పటికే.. ఆటగాళ్లు మొహాలీ చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. అయితే ఈ సిరీస్ లో అందరి కళ్లు టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. అసియాకప్-2022లో అదరగొట్టిన కోహ్లి.. ఇప్పుడు ఆసీస్ సిరీస్ లో ఎలా రాణిస్తాడో అన్నదే ప్రశ్న. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో బాంబ్ పేల్చాడు. ఆ వివరాలు..
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రసంగించాడు. ఈ సమయంలో జట్టు కూర్పుతో పాటు విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలా? అన్న విషయంపై స్పందించాడు. ‘టీ20 ప్రపంచకప్‌కు నెల రోజుల సమయం ఉంది. ఇలాంటి తరుణంలో జట్టు కూర్పు చాలా ముఖ్యం. ప్లేయర్లు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండాలి. జట్టు పరంగా.. ఏదైనా కొత్త ప్రయత్నం చేసినప్పుడు అదో సమస్యల మాత్రం చూడొద్దు. అది మంచి ప్రయోగంలా చూడాలి’ అని రోహిత్ తెలిపాడు.
Captain @ImRo45 addressing the press conference ahead of #INDvAUS series. pic.twitter.com/0i8tmstoUf
— BCCI (@BCCI) September 18, 2022
అలాగే.. విరాట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ మాకు మూడో ఆప్షన్. అక్కడే స్థిరంగా ఆడాలన్నది లేదు. కొన్ని మ్యాచ్‌లలో ఓపెనర్‌గా కూడా బరిలోకి దిగుతాడు. ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతను ఆడిన తీరుతో మేము చాలా సంతోషంగా ఉన్నాం” అని తెలిపాడు. ఒకవేళ కోహ్లీ, ఓపెనర్‌గా వస్తే.. రోహిత్ ఏ స్థానంలో ఆడతాడన్నది అసలు ప్రశ్న. కాగా, ఆసియాకప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు, కనీసం ఫైనల్ కు కూడా చేరుకోని సంగతి తెలిసిందే. అయితే.. ఆసియాకప్ లో బౌలింగ్ విభాగంలో కాస్త వీక్ గా కనిపించిన భారత జట్టు, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో పటిష్ఠంగానే కన్పిస్తోంది. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపాలన్నా నిర్ణయం సరైనదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Rohit Sharma says Virat Kohli is a ‘definite’ option as an opener: agreed, but that should not be plan B, it should be plan A imho. Virat & Rohit to open, Surya at 3 & KL Rahul at 4 🇮🇳 @ImRo45 @imVkohli #SportsYaari pic.twitter.com/6hsXC0aNkJ
— Sushant Mehta (@SushantNMehta) September 18, 2022