టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడంటే.. ఎలాంటి బౌలర్‌నైనా అల్లాడిస్తాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో మరోసారి తన బాదాడు ఎలా ఉంటుందో చూపించాడు. 8 ఓవర్లలో 91 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఓవర్‌లోనే విధ్వంసం సృష్టించాడు. పైగా కొట్టింది అలాంటి ఇలాంటి బౌలర్లను కూడా కాదు. ఏకంగా టీ20ల్లోనే నంబర్ బౌలర్‌గా ఉన్న జోష్ హెజల్‌వుడ్‌ను ఓ ఆటాడుకున్నాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే భారీ సిక్స్ బాదిన రోహిత్ తర్వాతి బంతిని అద్భుతమైన పుల్ షాట్‌తో మరో సిక్స్ బాదాడు. ఐదో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్‌ను కేఎల్ రాహుల్ ఇచ్చాడు.
రోహిత్ ఇచ్చిన సూపర్ స్టార్ట్‌తో రాహుల్ కూడా చివరి బంతికి సిక్స్ బాదాడు. దీంతో టీమిండియా ఎలాంటి ఆరంభం కావాలో అలాంటి మెరుపు ఆరంభం లభించింది. తొలి ఓవర్‌లోనే టీమిండియా ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అది కూడా టీ20 నంబర్ వన్ బౌలర్ వేసిన ఓవర్‌లో రావడం విశేషం. ఇలా తొలి ఓవర్‌లోనే టీ20ల్లో నంబర్ వన్ బౌలర్ అనే కనీస మర్యాద ఇవ్వకుండా.. జోష్ హెజల్‌వుడ్‌ను రోహిత్ చావాబాదడంతో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మళ్లీ అతనికి బంతి ఇవ్వలేదు. 8 ఓవర్లలో 90 పరుగులు డిఫెండ్ చేయాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ టాప్ ప్రధాన బౌలర్, టీ20ల్లో నంబర్ వన్ బౌలర్ కేవలం ఒకే ఓవర్‌కు పరిమితం అయ్యాడు. కాదు కాదు.. అతను అలా అయ్యేలా రోహిత్ శర్మ చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 8 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 31), మ్యాథ్యూ వేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 43 నాటౌట్) చెలరేగడంతో ఆసీస్ టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేట్, జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించారు. హర్షల్ పటేల్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ 2, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు.
కేవలం 8 ఓవర్లలోనే 91 పరుగులు చేయాల్సి దశలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్ నుంచే ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ రాహుల్ 10 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా రెండు బౌండరీలతో ఎదురుదాటికి దిగి.. జంపా బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా(9) కూడా వెంటనే అవుట్ అయ్యాడు.
ఒక వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులతో మ్యాచ్‌ను టీమిండియా చేతుల్లో పెట్టాడు. ఇక చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైన దశలో క్రీజ్‌లోకి వచ్చిన మిస్టర్ ఫినిషర్ దినేష్ కార్తీక్.. మ్యాచ్‌కు సూపర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. తను ఎదుర్కొన్న రెండు బంతుల్లోనే 6, 4తో మ్యాచ్‌ను మరో నాలుగు బంతులు ఉండగానే ముగించాడు. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించి.. 1-1తో సిరీస్‌ను సమం చేసింది. ఇక ఆదివారం హైదరాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌తో సిరీస్ ఎవరిదో తేలిపోనుంది. మరి ఈ మ్యాచ్‌లో హెజల్‌వుడ్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ శర్మ ఎటాకింగ్‌ప్లేపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma is the most dangerous batsman of the history of cricket. @ImRo45 💪. pic.twitter.com/VQBqqvXn8K
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) September 23, 2022
ఇది కూడా చదవండి: DK ఫినిషింగ్ టచ్! గొంతు పట్టుకున్న కెప్టెన్.. గుండెలకు హత్తుకున్నాడు!