నటసింహం బాలయ్య స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అదే బాలయ్య మాస్ డైలాగ్ చెబితే థియేటర్లో ఎలాంటి రీసౌండ్ వస్తుందో కూడా తెలుసు. తాజాగా బాలకృష్ణ 107 మూవీ వర్కింగ్ స్టిల్ వచ్చిన విషయం తెలిసిందే. నల్లటి చొక్కా, పంచ కట్టుకుని బాలయ్య మాస్ లుక్ లో అలరించారు. ఆ పిక్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో చూశాం. ఇప్పుడు ఆ క్రేజ్ ను స్పోర్ట్స్ ఛానల్ కూడా వాడుకోవడం మొదలు పెట్టింది.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 ప్రమోషన్స్ లో భాగంగా రోహిత్ ను బాలయ్య గెటప్ లోకి మార్చేసింది. అంతే అదిరిపోయే కోట్ కూడా పెట్టేసి ఇరగదీశారు. హిట్ కొట్టాలంటే బాలయ్య.. సిక్స్ కొట్టాలంటే హిట్ మ్యాన్ అంటూ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రమోషన్ పై మీ అభిప్రాయాలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hit కొట్టాలంటే బాలయ్య 🤩
6️⃣ కొట్టాలంటే Hitman యే భయ్యా! 💥మరి @ImRo45 లంకపై అదరగొట్టి 🥳#TeamIndia కు మరో సిరిస్ విక్టరీ అందిస్తాడా? 🏏
చూడండి#INDvSL | 1st T20I
సా 6 గ.కు
మీ #StarSportsTelugu / Disney + Hotstar లో#BelieveInBlue 💙 pic.twitter.com/zwYtRZdzGU— StarSportsTelugu (@StarSportsTel) February 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.