టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డ్ అంపైర్‌పై కోపంతో ఊగిపోయాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. సహజంగానే భావోద్వేగాలను అదుపుచేసుకోవడంలో వెనుకుండే రోహిత్.. మరోసారి కోపం తెచ్చుకున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఎదురీదుతోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 263 పరుగుల మోస్తారు స్కోర్‌కు ఆలౌట్ చేసిన భారత్.. వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసి.. తొలి రోజును ముగించింది. ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత ఓపెనర్లు కొద్ది సేపు నిలకడగానే ఆడుతున్నట్లు కనిపించినా.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో కేఎల్ రాహుల్, నాథన్ లయన్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్‌గా అవుట్ అయ్యాడు. దీంతో.. ఆస్ట్రేలియా తొలి వికెట్ దక్కింది. చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ మరోసారి విఫలమై.. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు.
ఇక తన మరుసటి ఓవర్‌లో అయితే లయన్ ఏకంగా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్ రెండో బంతికి 32 పరుగులతో నిలకడగా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన లయన్.. నాలుగో బంతికి పుజారాను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టీమిండియా 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కొద్ది సేపటికే శ్రేయస్ అయ్యర్ సైతం 4 రన్స్ చేసి అవుట్ అవ్వడంతో.. భారత్ మరింత కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి విరాట్ కోహ్లీ-జడేజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ.. జడేజా 26 రన్స్ చేసి మర్ఫీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ 43 రన్స్‌తో, కేఎస్ భరత్ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అయితే.. తొలి రోజును సంతృప్తికరంగా ముగించిన టీమిండియా రెండో రోజు మ్యాచ్‌లో నిలబడేందుకు పోరాడుతోంది.
అయితే.. రెండో రోజు ఆరంభంలో అవుటైన రోహిత్ శర్మ.. తొలి రోజు చివర్లో ఫీల్డ్ అంపైర్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. తొలి రోజు నాథన్ లయన్ వేసిన ఆఖరి ఓవర్‌లో రోహిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బాల్ ప్యాడ్‌కు తాకి ఫార్వర్డ్ షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్ అవుట్ కోసం అప్పీల్ చేయగా.. అపైంర్ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో.. చిర్రెత్తుకొచ్చిన రోహిత్ శర్మ.. కోపంగా రివ్యూ తీసుకున్నాడు. రివ్యూ తీసుకుంటున్న క్రమంలో బ్యాట్‌ను బలంగా కొట్టాడు. అంపైర్‌పై ఆగ్రహంతోనే బ్యాట్‌ను కొట్టినట్లు తెలుస్తోంది. అయితే.. రివ్యూలో బాల్ క్లియర్‌గా ప్యాడ్లకు తగిలినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో రోహిత్ కోపానికి అర్థం ఉందని క్రికెట్‌ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
#RohitSharma𓃵 #BGT23 #INDvsAUS pic.twitter.com/WoThMguwwf
— Sayyad Nag Pasha (@nag_pasha) February 18, 2023