భారత్-ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవలం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేని విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఒక అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంది.
కాకపోతే ఒకే మైల్‌స్టోన్‌కు చేరువలో ఉన్న ఇద్దరూ సరిగ్గా రెండు అడుగుల దూరంలోనే ఉండటంతో ఎవరు ముందు ఆ రికార్డును అందుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ వీరిద్దరూ టీ20 ఫార్మట్‌లో 298 బౌండరీలు బాదారు. ఫోర్లల్లో 300 మార్క్‌ను అందుకోవడానికి రెండు బౌండరీల దూరంలో నిలిచారు. శనివారం ఇంగ్లాండ్‌తో తలపడే రెండో టీ20 మ్యాచ్‌లో దీన్ని అందుకునే ఉవ్విళ్లూరుతున్నారు. సాధారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ– ఓపెనర్‌గా బరిలోకి దిగుతుంటాడు. విరాట్ కోహ్లీ వన్ డౌన్ బ్యాటర్‌గా క్రీజ్‌లోకి వస్తుంటాడు. విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే రోహిత్ శర్మే ముందుగా 300 బౌండరీల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు రోహిత్ త్వరగా అవుట్ అయితే తప్ప.
కాగా ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ పేరు మీద మాత్రమే ఉంది. 104 టీ20 మ్యాచ్‌లను ఆడిన స్టిర్లింగ్ 325 బౌండరీలు కొట్టాడు. వంద సిక్సర్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 97 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 3,296 పరుగులు చేశాడు. 298 బౌండరీలు, 92 సిక్సర్లు కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma and Virat Kohli need 2 more fours to complete 300 fours in T20I – only Paul Stirling has achieved this milestone.
— Johns. (@CricCrazyJohns) July 8, 2022