శ్రీలంకతో మంగళవారం గౌహతీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 373 పరుగులు చేసిన భారత్.. 67 పరుగుల తేడా గెలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడం కూడా ఈ మ్యాచ్‌కు హైలెట్‌గా మారింది. కోహ్లీతో పాటు కాస్త గ్యాప్ తర్వాత టీమ్‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సైతం మంచి టచ్‌లోకి రావడం టీమిండియా శుభసూచకం. అయితే.. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు అనుకూలంగా వచ్చినా.. మరో విషయంలోనూ భారత జట్టు అందరి మనసులు గెలుచుకుంది. శ్రీలంక కెప్టెన్ షనక మన్కడింగ్(రనౌట్) విషయంలో రోహిత్ శర్మ వ్యవహరించిన తీరుపై ప్రశంసల వర్షం కురిస్తోంది.
మ్యాచ్ ముగియడానికి మరో మూడు బంతులు మిగిలి ఉన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. షమీ మ్యాచ్ చివరి ఓవర్ వేస్తున్నాడు. అప్పటికే శ్రీలంక ఓటమి ఖాయమైపోయింది. కానీ.. శ్రీలంక ప్రేక్షకుల ఆసక్తి మాత్రం తమ కెప్టెన్ షనక సెంచరీపై ఉంది. ఆ టైమ్‌లో షనక 98 పరుగుల వద్ద ఉన్నాడు. కానీ.. షనక నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండిపోయాడు. ఇంకా మూడు బంతులే మిగిలి ఉన్నాయి. ఎలాగైన స్ట్రైక్ తీసుకుని సెంచరీ పూర్తి చేయాలనే ఆత్రంలో షమీ బాల్ రిలీజ్ చేయక ముందే.. పరుగు కోసం ప్రయత్నించాడు. దీంతో షమీ అతన్ని మన్కడింగ్(రనౌట్) చేసి.. అవుట్ కోసం అపీల్ చేశాడు.
మధ్యలో రోహిత్ శర్మ కలగజేసుకుని.. షమీతో మాట్లాడి అపీల్‌ను విత్‌డ్రా చేసుకోమని కోరాడు. కెప్టెన్ సూచన మేరకు నవ్వుకుంటూనే.. షమీ తన అపీల్‌ను రిటన్ తీసుకున్నాడు. దీంతో అదే ఓవర్ ఐదో బంతికి స్ట్రైక్ తీసుకున్న షనక ఫోర్ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఘటనపై రోహిత్ శర్మ స్పందిస్తూ..‘షమీ మన్కడింగ్ చేసినట్లు నాకు తెలియదు. షనక 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతన్ని అలా అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాంటి ప్లేయర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ కరెక్ట్ అనిపించలేదు. అందుకే అపీల్‌ను వెనక్కి తీసుకున్నాం. షనక అసాధారణ పోరాటానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.’ అంటూ రోహిత్ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో రోహిత్ ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is really a heart warming ❤️ moment for all of us when shami out danush shanaka at non strikers end at 98 runs but Rohit Sharma withdrawal that appeal..#RohitSharma𓃵 pic.twitter.com/ErcmLzw6xd
— Pt. Anu sharma (@ASPANDIT3) January 11, 2023