టీమిండియా సీనియర్ బ్యాటర్, సీఎస్కే ఆటగాడు రాబిన్ ఊతప్ప శుభవార్త అందించాడు. ఊతప్ప, శీతల్ గౌతమ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఊతప్ప ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. భార్యా, బిడ్డలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
వృత్తి రీత్యా టెన్నిస్ క్రీడాకారిణి అయిన శీతల్ గౌతమ్ ను ఊతప్ప ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2016, మార్చి3న వీరి పెళ్లి జరగగా.. ఈ దంపతులకు ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు.. నీల్ నోలన్ ఊతప్ప. ఇక రెండోసారి తండ్రైన తను.. కూతురు ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. “మా జీవితాల్లో అడుగుపెట్టిన చిన్నారి ‘ట్రినిటి థియా ఊతప్ప’ను మీకు పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. దీనిని మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాం’’ అని చిన్నారి గురుంచి ఊతప్ప ఉద్వేగపూరిత నోట్ రాసుకొచ్చాడు.
2006లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన రాబిన్ ఊతప్ప.. చివరిసారిగా 2015లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడాడు. ఊతప్ప ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Dutee Chand: ‘కూతురు వరుసయ్యే అమ్మాయిని’ పెళ్లాడతానంటున్న ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్!