రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో 4 సిక్సులు బాదేస్తా అంటూ పేర్కొన్నాడు. కానీ.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం...
ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నెల మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మొదలుకానుంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కోసం కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయా ఫ్రాంచైజ్‌లు సైతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇప్పటికే ప్రాక్టీస్ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. ఇక ఆస్ట్రేలియాతో ఈ నెల 17 నుంచి మొదలుకానున్న మూడు వన్డేల సిరీస్ కూడా ముగిస్తే.. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు వారి జట్లతో చేరనున్నారు. వారితో పాటు పలువురు అంతర్జాతీయ శ్రేణి ఆటగాళ్లు సైతం ఐపీఎల్ కోసం ఇండియాకు చేరుకోనున్నారు.
అలాగే భారత యువ క్రికెటర్లు ఈ సారి ఐపీఎల్‌లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని నెలల ముందు నుంచే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా గత ఐపీఎల్‌లో ఓ మోస్తారు ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లు.. ఈ సారి అంతకు మించి అదరగొట్టాలని ఉవ్విళూరుతున్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రియాన్ పరాగ్ గురించి. అస్సాంకు చెందిన ఈ ఆటగాడు.. గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు మూడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ అదరగొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు కొడతానని తన అంతరాత్మ చెబుతున్నట్లుగా రియాన్ పేర్కొన్నారు. అతని స్టేట్‌మెంట్ క్రికెట్ అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. సీజన్ సీజన్‌కు రియాన్ పిల్లచేష్టలు పెరిగిపోతున్నాయని, గతంలో ధోనిని మించిన ప్లేయర్ అవుతానని చేసిన కామెంట్‌ను గుర్తు చేస్తూ మరీ.. రియాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు తర్వాత.. ముందు వచ్చిన అవకాశాలను మంచిగా ఉపయోగించుకోమంటూ నెటిజన్లు సైతం హితవుపలుకున్నారు. మరి రియాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Riyan Parag special in IPL 2023? 👀#IPL2023 #CricTracker pic.twitter.com/lOzQCwh2Co
— CricTracker (@Cricketracker) March 14, 2023