నా భర్తకు నాకంటే ఆటే ఎక్కువంటూ భారత క్రికెటర్ భార్య సంచలన కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఎంత ఆట ఎక్కువైనా భార్యను పట్టించుకోవాలిగా' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ భారత క్రికెటర్ ఎవరు..? ఆమె మాటల వెనుకున్న అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ జడేజా ఏ రేంజ్ లో చెలరేగాడో అందరికీ తెలిసిన విషయమే. తన స్పిన్ మాయాజాలంతో కంగారుల కంటి మీద కునుకు లేకుండా చేశాడు. సాధారణంగా జడేజా భారత పిచ్ ల మీద చెలరేగడం ఇది తొలిసారి కాదు. గాయం నుండి కోలుకొని రంజీ ట్రోఫీ మ్యాచులు ఆడి మళ్ళీ టీమిండియాలో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దీంతో అందరూ జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో జడేజా భార్య రివాబా.. తన భర్త రీఎంట్రీపై స్పందించింది. “జడేజాకు క్రికెటే తొలి ప్రాధాన్యత.. ఆ తరువాతే నేను..” అంటూ రివాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జడేజా పునరాగమనంపై భార్య రివాబా మాట్లాడుతూ “జడేజా గాయం నుంచి కోలుకోని తిరిగి కం బ్యాక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అతను చాలా నిబద్దత ఉండే ఆటగాడు. ఎప్పుడు క్రికెట్ మీద అంకిత భావం కలిగి ఉంటాడు. ఇదే తన బలం. సాధారణంగా జడేజా చాలా తక్కువగా మాట్లాడతాడు. తన ఆటతోనే అందరికి సమాధానం చెబుతాడు. తన గురించి విమర్శలు వచ్చినప్పటికి వాటినేమి పట్టించుకోకుండా తన లోపాల మీద దృష్టి పెడతాడు” అని రివాబా చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో రివాబా జడేజాకు క్రికెట్ మీద ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతూ.. “దేశం తరపున ఆడడానికే జడేజా తొలి ప్రాధాన్యమిస్తాడు. అతనికి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే అన్నిటికన్నా ముఖ్యం” అని జడేజాని ఆకాశానికి ఎత్తేసింది. అయితే ఒక భర్తగా జడేజాను ప్రశంసించడం బాగానే ఉన్నా.. ‘క్రికెట్టే జడేజా తొలి ప్రాధాన్యం’ అని చెప్పి జడేజా గౌరవాన్ని అమాంతం పెంచేసింది. ఈ విషయంలో తాను రెండో స్థానంతో సరిపెట్టుకుట్టున్నట్లుగా ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
‘Cricket is his top priority’: #RavindraJadeja‘s wife #Rivaba opens up on all-rounder’s comeback after injuryhttps://t.co/DI32KTp7gL
— DNA (@dna) February 22, 2023
ఇక జడేజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అదరగొట్టి టీంఇండియా విజయంలో కీలకంగా మారాడు. జడేజా ఇదే జోరుని తర్వాత రెండు టెస్టులకి కొనసాగిస్తే భారత్ కి తిరుగుండదు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి1 న ఇండోర్ వేదికగా జరగనుంది. మరి జడేజా భార్య రివాభా వ్యాఖ్యలు మీకు ఏ విధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“રવિન્દ્ર જાડેજાએ કમબેક કર્યા બાદ જે યાદગાર પર્ફોમેન્સ આપ્યુ છે તેની પાછળ તેમની સખત મહેનત જવાબદાર છે”: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા#RavindraJadeja #IndvsAus2ndtest #RivabaJadeja@Rivaba4BJP @imjadeja #GTVideo pic.twitter.com/vXYitoaFwi
— Gujarat Tak (@GujaratTak) February 20, 2023