పోటీ ప్రపంచంలో ఎప్పుడు, ఎం జరుగుద్దో, ఎవ్వరూ ఊహించలేరు. కాస్త.. స్పీడ్ తగ్గించినా.. మన అవకాశాలను ఎవరో ఒకరు ఒడిసి పట్టేస్తారు. ఇండియన్ క్రికెట్ టీమ్ యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. గత రెండున్నర సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అయ్యర్ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే డీసీ మంచి ఫలితాలను అందుకుంది. ముఖ్యంగా ఢిల్లీ లాస్ట్ సీజన్ లో ఫైనల్ కి కూడా చేరుకుంది. దీంతో.., ఢీల్లీ ఆశాకిరణం శ్రేయాస్ అయ్యర్ అనే అంతా అనుకున్నారు. కానీ.., ఈ సీజన్ లో మొదటి ఎనిమిది మ్యాచ్ లకి శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకుండా పోయాడు. భుజం గాయం కారణంగా అతను జట్టుకి దూరం అయ్యాడు. ఆ సమయంలో ఢిల్లీ జట్టు యాజమాన్యం పంత్ ని కెప్టెన్ గా నియమించుకుంది.
పంత్ సారధ్యంలో డీసీ తొలి దశ మ్యాచ్‌లలో మంచి విజయాలను అందుకుంది. మొత్తం 8 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.., శ్రేయాస్ అయ్యర్ కి ఇప్పుడు ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ షాక్ ఇచ్చింది. “గాయం నుంచి ఇప్పుడే కోలుకున్న అయ్యర్ ని కెప్టెన్ చేసి రిస్క్ చేయలేము, అతను ఆటగాడిగా మాత్రమే జట్టుకు సేవలందిస్తాడు” జట్టు కెప్టెన్ గా పంత్ యధావిధిగా కొనసాగుతాడు” అని ఢిల్లీ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఈ మధ్య కాలంలో పంత్ జాతీయ జట్టులో పర్మినెంట్ ప్లేయర్ అయిపోయాడు. అతని క్రేజ్ ని దృష్టిలో ఉంచుకునే ఢిల్లీ జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి.. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వీరిద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని మీరు అనుకుంటున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.