టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అతని తర్వాత భారత్‌ను టెస్టు ఫార్మాట్‌లో నడిపించే నాయకుడు ఎవరే దానిపై చర్చ మొదలైంది. ఇప్పటికే కోహ్లీ స్థానంలో టీ20, వన్డే కెప్టెన్‌గా నియామకం అయిన రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు సైతం అప్పగించే అవకాశం ఉన్నట్లు ఇప్పటి వరకు అంతా భావించారు. కానీ అనూహ్యంగా మరో యంగ్ క్రికెటర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది.
టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్ సైతం యంగ్ క్రికెటర్‌కు టెస్టు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. దీంతో రోహిత్ శర్మకు పోటీగా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరు వినిపిస్తుంది. అలాగే వైట్, రెడ్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉంటే మంచిదే అనే భావనలో బీసీసీఐ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో రిషభ్‌కు టెస్టు పగ్గాలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో పాటు రోహిత్ శర్మ వయసు, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుంటే రిషభ్ పంత్ బెటర్ అని క్రికెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు.
రిషభ్ పంత్.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పంత్‌కు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితం ఉంటుందని బీసీసీఐ చైర్మన్ గంగూలీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కోహ్లీ వారసుడిగా ఎవరైతే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.