యువ క్రికెటర్‌గా టీమిండియా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుని, భారత క్రికెట్‌కు భవిష్యత్తుగా కనిపించిన పంత్.. దురదృష్టవశాత్తు కారు ప్రమాదం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ప్రస్తుతం తిరిగి కోలుకుంటున్న పంత్.. తాజాగా ఒక వీడియోను షేర్ చేశాడు. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్.. గతేడాది డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్‌కు కారులో ఒంటరికగా బయలు దేరిన పంత్.. మార్గమధ్యలో నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక యువకులు పంత్‌ను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో చాలా రోజులు చికిత్స పొందిన పంత్.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న పంత్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చేతికర్ర సాయంతో నడుస్తున్న పంత్.. తాజాగా నడుములోతు నీళ్లున్న స్విమ్మింగ్‌పూల్‌లో నడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత పంత్ నడుస్తున్నాడంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. కొంతమంది మాత్రం స్విమ్మింగ్ పూల్‌లో స్టిక్ పట్టుకుని నడవడం అవసరమా? ఇవే తగ్గించుకుంటే మంచిదని కామెంట్లు చేస్తున్నారు. కారు ప్రమాదానికి కంటే ముందు పంత్‌పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. మళ్లీ ఇప్పుడు పంత్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
అయితే.. పంత్ తన ఫిజికల్ ఎక్స్‌సైజ్‌లో భాగంగానే స్విమ్మింగ్‌పూల్‌లో నడిచాడనే విషయం చాలా మందికి తెలియదు. కాలిక అయిన బలమైన గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు ఇలాంటి చిన్నచిన్న ఫీట్లు చేయాల్సి ఉంటుందని, అవగాహన ఉన్నవాళ్లు సోషల్ మీడియాలో ఆకతాయిలకు సమాధానం ఇస్తున్నారు. నీళ్లలో నడవడంతో పంత్ త్వరగా పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. పంత్ లేకపోవడం టీమిండియా పెద్ద లోటుగా మారింది. ఇటివల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలిచినా.. పంత్‌లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ సమయానికి పంత్ కోలుకుని జట్టులోకి తిరిగి రావాలని క్రికెట్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి పంత్ స్విమ్మింగ్ పూల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Grateful for small thing, big things and everything in between. 🙏#RP17 pic.twitter.com/NE9Do72Thr
— Rishabh Pant (@RishabhPant17) March 15, 2023