టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ను ఒక క్రికెటర్ దారుణంగా మోసం చేశాడు. హర్యానాకు చెందిన లోకల్ క్రికెటర్ మ్రినాంక్ సింగ్… ఖరీదైన వాచీలు, మొబైల్ ఫోన్లను మంచి ధరకు అమ్మిపెడతానని చెప్పి.. పంత్ దగ్గర్నుంచి రూ.1.63 కోట్ల విలువైన వాచీలను, బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు. రిషభ్ పంత్‌కు ఖరీదైన వాచీలంటే బాగా ఇష్టపడే పంత్.. రూ.36 లక్షలు పెట్టి ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచ్‌కింగ్ సిరీస్‌కి చెందిన వాచీని, 62 లక్షలతో మరో క్రేజీ కలర్ రిచర్డ్ మిల్లే వాచీని కొనుగోలు చేశాడు. అయితే ఆ వాచీలు అమ్మిబెడతానని నమ్మించి, వాటిని తీసుకుని, బోగస్ చెక్‌తో మ్రినాంక్.. పంత్‌ను మోసం చేశాడు.
తాను మోసమోయానని గ్రహించిన రిషభ్ పంత్, అతని మేనేజర్ పునీత్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 2021లో మ్రినాంక్ సింగ్, రిషభ్ పంత్‌తో పాటు అతని మేనేజర్ పునీత్ సోలంకిని కలిశాడు. తాను ఓ కొత్త వ్యాపారం మొదలెట్టానని ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, జ్యూవెలరీని కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటానని నమ్మబలికాడు. తాను చాలామంది క్రికెటర్లకు ఇలా వాచీలు అమ్మినట్టు రిఫరెన్సులు కూడా చూపించాడు. పాత వాచీలు ఎక్కవ ధరకు అమ్మిబెట్టి, తక్కువ ధరకు వాచీలు ఇప్పిస్తానని మ్రినాంక్ సింగ్ చెప్పిన మాటలను నమ్మిన రిషబ్ పంత్, సోలంకి… అతనికి ఓ ఖరీదైన వాచీ, కొన్ని బంగారు నగలను అందించారు.
ఫిబ్రవరిలో వాటిని రిషభ్ పంత్ నుంచి రీసేల్ కోసం కొనుగోలు చేసినట్టుగా రూ.163 లక్షల 70 వేల 731 లకు మ్రినాంక్ సింగ్ చెక్కు ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావడంతో మ్రినాంక్ పై రిషభ్ పంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా గత వారం కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు, అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు. మ్రినాంక్ సింగ్ చేతిలో చాలా మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ravi Shastri: రిషబ్ పంత్ తీరుపై విరుచుకుపడిన రవిశాస్త్రి.. ఏకి పారేశాడు!
Mrinank is currently in Arthur Road Jail in Mumbai after he was arrested by Juhu police for cheating a businessman in the city.#RishabhPant https://t.co/GHPbcGe7sX
— India Today Sports (@ITGDsports) May 23, 2022