టీమిండియా క్రికెటర్ పంత్ కారు యాక్సిడెంట్ అయింది. ఉదయం లేస్తూ లేస్తూనే ఈ న్యూస్ చూసి చాలామంది షాకయ్యారు. కారు పూర్తిగా కాలిపోయి బూడిదైన ఫొటోలు చూసి భయపడ్డారు. ఎందుకంటే డివైడర్ ని కారు బలంగా ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఏదైతేనేం పంత్ క్షేమంగా బయటపడటంతో అందరూ హమ్మయ్యా అని రిలాక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ కొన్ని సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా కారు యాక్సిడెంట్ జరిగిందనగానే అందరూ కారణం ఏంటని ఆరా తీస్తారు. ఇప్పుడు పంత్ యాక్సిడెంట్ కూడా ఓ విషయమే కారణమని బలంగా అనిపిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా దొరికిన అద్భుతమైన యంగ్ క్రికెటర్లలో పంత్ ఒకడు. అండర్-19 ప్రపంచకప్, ఆ తర్వాత ఐపీఎల్ తో ఫేమ్ తెచ్చుకున్న మనోడు.. టీనేజ్ లో స్టార్ అయిపోయాడు. ఫేమ్ సంపాదించాడు. డబ్బులు కూడా అలానే వచ్చిపడ్డాయి. దీంతో 19 ఏళ్ల వయసులో అంటే 2017లో బెంజ్ కారు కొన్నాడు. ఆ తర్వాత దాన్ని డ్రైవ్ చేసుకుంటూ కొన్ని వీడియోస్ ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. కొత్త కారుని డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వీడియోలో.. స్పీడోమీటర్ లో ఏకంగా 126 కిలోమీటర్ల వేగం చూపించింది. అప్పట్లో పంత్ డ్రైవింగ్ పై విమర్శలు రావడంతో సదరు వీడియోని డిలీట్ చేసేశాడు.
అయితే మళ్లీ ఇన్నాళ్లకు పంత్ తన సొంతకారులో ఉత్తరాఖండ్ నుంచి దిల్లీలోని ఇంటికి వెళ్తుండగా భారీ ప్రమాదం జరిగింది. బలంగా వెళ్లి డివైడర్ ని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి.. కారు పూర్తిగా దగ్ధమైపోయింది. దీన్ని ముందే గమనించిన పంత్, కారు విండో గ్లాస్ బద్దలు కొట్టి బయటకు దూకేశాడు. ఇక్కడా అంతా బాగానే ఉంది. పంత్ క్షేమంగానే ఉన్నాడు. కానీ ఈ ప్రమాదం జరగడానికి పంత్, ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేయడమే కారణమని తెలుస్తోంది. గతంలో పంత్ డ్రైవింగ్ స్పీడ్ గురించి వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలా జరగడం వల్లే పంత్ కి ప్రమాదం జరిగిందా అని పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి పంత్ యాక్సిడెంట్ కి కారణం ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
Get Well Soon Rishabh Pant💜 pic.twitter.com/yJJVggHXWk
— Rasul Jaansum786 (@Rasuljaansum111) December 30, 2022
This video is told to be of Rishabh Pant’s recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantop pic.twitter.com/mK8QbD2EIq
— Siddhant Mohan (@Siddhantmt) December 30, 2022