అతివేగం చాలా ప్రమాదం. ప్రాణాలు కూడా పోతుంటాయి. ఈ విషయం మనలో దాదాపు అందరికీ తెలుసు. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే కుటుంబం ఒంటరిదైపోతుంది. కొన్నిసార్లు రోడ్డున పడుతుంది. అందుకే ఏ వాహనం నడిపినా సరే నెమ్మదిగా వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కుర్రాళ్లది ఉడుకురక్తం కదా.. మాకు ఒకరు చెప్పేదేంటి! అని రయ్ రయ్ మని బండి నడుపుతుంటారు. తాజాగా టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కు యాక్సిడెంట్ అయింది. తీవ్రగాయాలతో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీనేజ్ సెన్సేషన్ పంత్. అండర్ -19, ఐపీఎల్ లో అదరగొట్టిన మనోడు.. టీమిండియాలోకి అంతే ఫాస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ తర్వాత వికెట్ కీపర్ స్థానం కోసం అతడే ప్రత్యామ్నయంగా కనిపించాడు. బీసీసీఐ అతడికే వరసగా అవకాశాలు ఇస్తూ వస్తోంది. మైదానంలో దూకుడుగా ఉండే పంత్.. కారు కూడా అంతే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంటాడు. కెరీర్ స్టార్టింగ్ లో బెంజ్ కారు కొన్నప్పుడు డ్రైవ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. స్పీడుపై విమర్శలు రావడంతో ఆ వీడియోని డిలీట్ చేశాడు. ఇప్పుడు పంత్ కారుకి యాక్సిడెంట్ జరగడంతో గతంలో పంత్ స్పీడ్ డ్రైవింగ్ కి సంబంధించిన పలు వీడియోస్ బయటకొస్తున్నాయి.
ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఐపీఎల్ లో ఓ మూడేళ్ల క్రితం దిల్లీ క్యాపిటల్స్ జట్టులో పంత్-ధావన్ కలిసి ఆడారు. ఈ క్రమంలోనే మ్యాచ్ ల మధ్యలో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ టైంలో ‘నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా?’ అని ధావన్ ని అడిగాడు. దీనికి సమాధానంగా ‘బండి.. కాస్త మెల్లగా నడుపు’ అని నవ్వుతూనే ధావన్ చెప్పాడు. అప్పుడు ‘సరే నేను మీ సలహా తీసుకుంటున్నాను బండి మెల్లిగా నడుపుతాను’ అని పంత్ ఆన్సర్ ఇచ్చాడు. మూడేళ్ల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో.. ఇప్పుడు పంత్ కి యాక్సిడెంట్ కావడంతో మళ్లీ వైరల్ గా మారింది. అప్పుడే ధావన్ హెచ్చరించాడు కానీ పంత్ లో మార్పు రాలేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. పంత్ కు ప్రమాదం జరిగిన వెంటనే.. ‘ప్రాణాలతో బయటపడేసినందుకు థాంక్ గాడ్, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అని ధావన్ ట్వీట్ చేశాడు. మరి పంత్ యాక్సిడెంట్ కి రీజన్ ఏమై ఉండొచ్చని మీరనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని రాయండి.
This was @SDhawan25’s golden advise to @RishabhPant17 three years ago. pic.twitter.com/dYVzgatAhC
— Rica Roy (@cheerica) December 30, 2022