బాలీవుడ్ ని క్రికెట్ ను విడదీసి చూడలేం.. బాలీవుడ్ భామలను పెళ్లాడిన, ప్రేమాయణాలు సాగించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆ లిస్ట్ లో రిషబ్ పంత్ కూడా చేరుతాడు అనే అనుకున్నారు అందరు. కానీ, పంత్ ప్రేమాయణానికి ఎండ్ కార్డు వేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాతో రిలేషన్ కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి. వారి రిలేషన్ గురించి ఎక్కడ అధికారికంగా చెప్పలేదు. కానీ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. రెండేళ్ల క్రితం ముంబైలోని కాస్ట్లీ హోటల్ లో ఇద్దరూ డిన్నర్ చేస్తూ కనిపించారు. పంత్ బర్త్ డేకి ఊర్వశి విషెస్ చెప్పడంతో ఇంకా వాళ్ళ మధ్య ఎదో నడుస్తూ ఉందనే అనుకున్నారు.
తాజాగా ఊర్వశి మేనేజర్ పంత్ – ఊర్వశి మధ్య రిలేషన్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇద్దరూ పరస్పర ఒప్పందంతో వాట్సాప్ లో బ్లాక్ చేసుకున్నట్లు వెల్లడించాడు. క్రికెట్ పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి మాత్రం ఎన్నిసార్లు మెసేజ్లు చేసినా స్పందించడం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2019లోనే రిషభ్ పంత్ డెహ్రాడూన్ కు చెందిన ఇషా నేగితో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించాడు. ఆమెతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. ‘నా సంతోషానికి కారణమైన నిన్ను ఎప్పటికీ సంతోషంగా చూసుకుంటా’ అంటూ పేర్కొన్నాడు. అదే ఫొటోను ఇషా నేగి కూడా షేర్ చేసింది. ఐపీఎల్ 2021 కోసం రిషభ్ పంత్ యూఏఈ వెళ్లగా.. ఇషా కూడా యూఏఈ వెళ్లింది. ఈ రిలేషన్ పై మాత్రం పంత్ వైపు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.