టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు.. డివైడర్ ని ఢీ కొట్టడంతో పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. రిషభ్ తల, వీపు, మోకాలికి బలమైన గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నుంచి దిల్లీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. పంత్ ని తొలుత రిషికేష్ లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం దిల్లీకి తీసుకెళ్లారు. అయితే ప్రమాదం సమయంలో పంత్ చాకచక్యంగా వ్యవహరించి చేసిన ఓ పనే.. ఇప్పుడు అతడి ప్రాణాల్ని కాపాడిందని తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య బంగ్లాదేశ్ తో రెండో టెస్టు ఆడిన రిషభ్ పంత్, స్వదేశానికి తిరిగొచ్చేశాడు. త్వరలో జరగబోయే శ్రీలంకతో టీ20, వన్డే సిరీసుల కోసం పంత్ ని ఎంపిక చేయలేదు. దీంతో అమ్మని సర్ ప్రైజ్ చేద్దామని ఆమెకు చెప్పకుండానే ఇంటికెళ్తున్నాడు. ఇలా మార్గం మధ్యలో ఉండగా.. తన బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురైంది. డివైడర్ కు కారు బలంగా గుద్దడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఈ టైంలో చాలా తెలివిగా వ్యవహరించిన పంత్.. విండో గ్లాస్ బ్రేక్ చేసుకుని బయటకు దూకేశాడు. ఇది జరిగిన కొన్ని క్షణాలకే అతడి కారు పూర్తిగా దగ్దమైంది.
ప్రస్తుతం పంత్ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతి ఒక్కరూ పంత్ కు యాక్సిడెంట్ అయిందని తెలిసి షాకవుతున్నారు. అదే టైంలో అతడి ధైర్యాన్ని, తెగువని చూసి మెచ్చుకుంటున్నారు. టీమిండియా తరఫున ఎన్నో మ్యాచుల్లో ధైర్యంగా బ్యాటింగ్ చేసి మ్యాచులు గెలిపించినట్లే.. చనిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు కూడా పంత్ చాలా తెగింపు చూపించాడు. ధైర్యం చేసి కారు గ్లాస్ బ్రేక్ చేసుకుని మరీ బయటకు దూకేశాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. అలానే పంత్ త్వరగా కోలుకుని.. గ్రౌండ్ లోకి వచ్చేస్తాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి పంత్ చేసిన ధైర్యంపై మీరేం అనకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
It happend just before I arrived there …it was horrible..i shoot this video ..it was terrible accident ..mufadlal bhai ..it happened in narsan village .. pic.twitter.com/lMAh2dJSsu
— naveen khaitan (@naveenkhaitan) December 30, 2022