ఐపీఎల్ 2022లో బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య సూపర్ థ్రిల్లింగ్ హైస్కోరింగ్ మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం లక్నోను వరించింది. కానీ.. కేకేఆర్ యువ క్రికెటర్ రింకూ సింగ్ మాత్రం అందరి మనసులు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్నో రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పినా, డికాక్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించినా.. కేఎల్ రాహుల్ బ్యాట్ ఝుళిపించినా.. ప్రస్తుతం రింకూ సింగ్ టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. కొట్టింది 40 పరుగులే అయినా 140 పరుగులు చేసిన డికాక్ కంటే కూడా ఎక్కువ అభినందనలు అందుకుంటున్నాడు.
సూపర్ బ్యాటింగ్‌తో లక్నో బౌలర్లపై విరుచుకుపడుతున్న కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, స్యామ్ బిల్లింగ్స్ వేగంగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయినా.. అరివీర భయంకర బ్యాటర్ ఆండ్రూ రస్సెల్ తక్కువ రన్స్‌కే పెవిలియన్ చేరినా.. కొండంత లక్ష్యం అసాధ్యంగా కనిపిస్తున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు రింకూ సింగ్. ఒత్తిడిలో కేవలం 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేసి లక్నో గుండెల్లో రైళ్లు పరిగెటించాడు. కేకేఆర్ విజయానికి చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమైన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి నాలుగు బంతుల్లో వరుసగా 4, 6, 6, 2 కొట్టి కేకేఆర్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ ఐదో బంతికి లూయిస్ అద్భుతమైన క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. చివరి బంతికి 3 పరుగులు చేయలేక కేకేఆర్ మ్యాచ్‌లో ఓడిపోయింది.కానీ.. రింకూ ఆడిన ఇన్నింగ్స్‌పై, ఒత్తిడిలో అతను చూపించిన పోరాట పటిమపై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో రింకూ సింగ్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి అనే ప్రశ్నలు అందరి మదిలో మెదులుతోంది. 24 ఏళ్ల రింకూ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఖన్‌చంద్‌ది డోర్ టు డోర్ గ్యాస్ సిలిండర్లను డెలివరి చేసే ఉద్యోగం. తల్లి వీణా దేవి గృహణి. సోదరుడు జీతూసింగ్ ఆటో నడుపుతుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రింకూ సింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఎంత ఆసక్తికరమో.. అంత విషాదమయం కూడాను. రింకూ పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతిలోనే చదువును మానేశాడు.
కేవలం రెండు గదులు ఉన్న ఓ చిన్న క్వార్టర్‌లో తొమ్మిదిమంది కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు, అన్న జీతూసింగ్, చెల్లెలు నేహాసింగ్, వదిన, వారి పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు రింకూ”. “రింకూ సింగ్ కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. సచిన్ టెండుల్కర్, సురేష్ రైనా అతని ఆరాధ్య క్రికెటర్లు. ఎప్పటికైనా వారిలా ఒక క్రికెటర్ గా ఎదగాలనే బలమైన కోరికతో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడే కష్టంలో తానూ పాలుపంచుకునేవాడు. దీనికోసం ఒకదశలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో స్వీపర్‌గా కొద్దిరోజులు పని చేశాడు. ఆటోడ్రైవర్‌గానూ కష్టపడ్డాడు. ఇలా ఎన్నో కష్టాలు పడుతూ దేశవాళీ క్రికెట్ లో బాగా రాణించి ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. అలా.. 2018లో ఐపీఎల్‌లో ఇచ్చిన రింకూ సింగ్ ని 80 లక్షల రూపాయలకు కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టులోకి తీసుకుంది. దీంతో అతని దశ తిరిగిపోయింది.2018లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకూ.. ఇప్పటి వరకు ఆడింది 17 మ్యాచ్‌లు మాత్రమే. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన రింకూ 174 పరుగులు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రింకూ పూర్తి పేరు రింకూ ఖాన్‌చంద్ సింగ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్, లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో ఉత్తర్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన రింకూ 2307 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా బుధవారం లక్నోతో ఆడిన ఇన్నింగ్స్ రింకూ కెరీర్‌లోనే అత్యుత్తుమ ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. మరి ఈ సూపర్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Quinton de Kock: కోల్‌కత్తాను చితక్కొట్టిన క్వింటన్ డికాక్! ముంబై ఫ్రాంచైజ్‌పై ఫ్యాన్స్ ఫైర్
Heart goes out to Rinku Singh who played splendidly and got out to hell of a good catch. What a brave innings little boy. More coming in your way. #LSGvsKKR #TATAIPL pic.twitter.com/DluymS27Cv
— Amit Mishra (@MishiAmit) May 18, 2022