భారత తుది జట్టులో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు టీమిండియాలో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో తుది జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. పైగా దినేష్ కార్తీక్ లాంటి వెటరన్ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతో తిరిగి జట్టులో చోటు కోసం యువ క్రికెటర్లతో పోటీ పడుతుండడం పెద్ద సమస్యగా మారింది.
యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలా.. అనుభవంతో పాటు భీకర ఫామ్‌లో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలా అనే విషయం తేల్చుకోవడం తలకుమించిన భారం అవుతుంది. దీంతో సీనియర్లలకు చిన్న జట్లతో జరిగే సిరీస్‌లకు విశ్రాంతి ఇస్తూ యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తూ సెలెక్టర్లు ఎలాగోలా నెట్టుకోస్తున్నారు. కానీ.. అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి మాత్రం ది బెస్ట్ టీమ్‌ను ఎంపిక చేయాలి.
అప్పుడు మాత్రం ఈ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, రోటేషన్ సిస్టమ్, విశ్రాంతి లాంటి పప్పులు ఉడకవు. టీ20 వరల్డ్ కప్‌కు మరెంతో దూరం లేకపోవడంతో ఏఏ ఆటగాళ్లు ఉండాలి అనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో రిషభ్ పంత్, దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లు ఉండాలని.. అవసరమైతే ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టిన పర్వాలేదని అభిప్రాయపడ్డాడు.
పంత్ వికెట్ కీపర్ కమ్ మిడిల్డార్ బ్యాటర్‌గా పనికొస్తాడని.. అలాగే దినేష్ కార్తీక్ స్టాండ్‌పై కీపర్ కమ్ ఫినిషర్‌గా జట్టుకు ఎంతో ఉపయోగంగా ఉంటాడని పాంటింగ్ పేర్కొన్నాడు. పైగా ఇషాన్ కిషన్ పెద్దగా ఫామ్‌లో కూడా లేడని.. రోహిత్ శర్మ, కేఎల్‌రాహుల్ ఉండగా ఇషాన్‌కు ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉండదని తెలిపాడు. అందుకే పంత్, కార్తీక్ కోసం ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టొచ్చు అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ricky Ponting believes that India should go with both Rishabh Pant and Dinesh Karthik for the T20 World Cup.#CricTracker #RishabhPant #DineshKarthik #Cricket #T20WorldCup pic.twitter.com/mywvv4Vtzo
— CricTracker (@Cricketracker) July 21, 2022