టీమిండియాలో గత పది పదిహేనేళ్ల ముందు ఓ లెక్క.. ఆ తర్వాత ఓ లెక్క. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయిన తర్వాత జట్టులో చాలా అద్భుతాలు జరిగాయి. ఎప్పటినుంచో ఊరిస్తున్న వన్డే ప్రపంచకప్ మనం గెలిచాం. అంతకు నాలుగేళ్ల ముందు టీ20 ప్రపంచకప్ సాధించాం. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాయి. ఇదే కాదు చాలామంది అద్భుతమైన కుర్రాళ్లు జట్టులోకి వచ్చారు. ప్రతి ఫార్మాట్ లోనూ గెలుస్తూ జట్టులో జోష్ తీసుకొచ్చారు. ఇక్కడో కామన్ థింగ్ కూడా మిగతా జట్లలోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అది ఏ గేమ్ అయినా సరే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. బాడీ విషయంలో ఫెర్ఫెక్ట్ ఉన్నప్పుడే గ్రౌండ్ లో చురుగ్గా కదులుతారు. గత కొన్నాళ్లలో కోహ్లీ, జడేజా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు సిక్స్ ప్యాక్స్ తో కనిపిస్తూ మిగతా ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచారు. దీంతో దాదాపు టీమిండియా క్రికెటర్లందరూ కూడా జిమ్ లో చెమటోడ్చుతున్నారు. ఫిట్ నెస్ విషయంలో తగ్గేదే లే అని ప్రూవ్ చేశారు, చేస్తున్నారు. ఇప్పుడు అదే విషయం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇండియన్ క్రికెట్ ముఖచిత్రాన్ని విరాట్ కోహ్లీ మార్చేశాడు. ఫిట్ నెస్, ఆట కోసం కష్టపడే విషయంలో కోహ్లీ నిజంగా గ్రేట్’ అని రికీ పాంటింగ్ అన్నాడు. రికీ మాటల బట్టి చూస్తుంటే టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ప్రదర్శన గురించి జోస్యం చెబుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాటింగ్ పరంగా ఎలాంటి ఆలోచన లేకపోయినప్పటికీ.. భారత్ బౌలింగ్ లో మాత్రం తడబడుతోంది. ఆస్ట్రేలియాలో ఉండేవన్నీ కూడా పేస్ పిచ్ లు. కాబట్టి మరి మన జట్టు ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. మరి కోహ్లీ గురించి పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Let’s go ⏳🇮🇳 pic.twitter.com/2a7hSuqyi6
— Virat Kohli (@imVkohli) October 18, 2022