ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ భారత క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇన్నోవేషన్, స్కిల్ విషయంలో అంతటి బెటర్ ప్లేయర్‌ను తాను ఇంత వరకు చూడలేదని అన్నాడు. అందురూ ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో అతన్ని పోలుస్తున్నారని.. నిజానికి అతను వారికంటే మెరుగ్గా ఆడుతున్నాడంటూ ఆకాశానికెత్తేశాడు. మరి పాంటింగ్‌ను అంతలా ఆకర్షించిన ఆటగాడు ఎవరని ఆలోచిస్తున్నారా? ఇంకెవరు మన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. టీ20 క్రికెట్‌లో తనకు మాత్రమే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్న సూర్యకు.. తాజాగా ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డు కూడా వరించింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ గురించి మాట్లాడిన పాంటింగ్ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఐదారేళ్ల నుంచి సూర్య ఐపీఎల్‌లో ఇలాంటి ఆట ఆడటం మొదలుపెట్టాడు. డీప్-బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా బంతిని ఫ్లిక్ చేయడంలో బాల్‌ను ఫైన్-లెగ్ మీదుగా బాదడంలో అతనికి మించిన వారు లేరు. షార్ట్ బాల్స్‌ను సైతం కీపర్ తలపై నుంచి ఫ్లిక్ చేయగలడు. అవి పోర్లుగా కొన్ని సార్లు సిక్సులుగా కూడా వెళ్లాయి. కొత్త కొత్త షాట్ల విషయంలో, స్కిల్ విషయంలో సూర్య లాంటి బెటర్ ప్లేయర్‌ను నేను చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లు టీ20 క్రికెట్‌లో సూర్యను అనుకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది టీ20 క్రికెట్‌కు ఎంతో మేలు చేయనుంది. ఐపీఎల్ 2023లో సూర్యలా ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నారు.’ అని అన్నాడు.
నిజంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ ఈ స్థాయికి ఎదుగుతాడని తాను అనుకోలేదని పాంటింగ్ అన్నాడు. సూర్య ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని, అతని శరీర ఆకృతిని బట్టి ఆ విషయం చెప్పవచ్చని తెలిపాడు. 32 ఏళ్ల సూర్య.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లాంటి అత్యుత్తమ ఫినెట్‌స్ కలిగిన ఆటగాళ్లు ఉన్న టీమ్‌లో ఆడుతూ.. మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా.. టీ20ల్లో అదరగొడుతున్న సూర్యను వన్డేల్లోను ఆడించి.. వరల్డ్ కప్‌లో ఒక తురుపుమొక్కలా సూర్యను వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే సూర్యకు వన్డేల్లో అవకాశం కల్పిస్తోంది. కానీ.. సూర్య టీ20ల్లో సక్సెస్ అయినంతగా వన్డేల్లో కాలేకపోతున్నాడు. మరి సూర్యకుమార్ యాదవ్ గురించి పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Former Australia skipper Ricky Ponting has branded Suryakumar Yadav as the best player he has ever seen in terms of innovation and skill 🫡🇮🇳#India #TeamIndia #CricketTwitter pic.twitter.com/frs94NierR
— Sportskeeda (@Sportskeeda) January 27, 2023