కొన్ని రోజుల క్రితం టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఆరు నెలల కాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దాంతో ఈ సంవత్సరం జరగబోయే అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటుగా IPL కు కూడా దూరం కానున్నాడు పంత్. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొచ్ రికీ పాంటింగ్, పంత్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఆడకున్నా పర్లేదు.. కానీ అతడు డగౌట్ లో మా పక్కన కూర్చుంటే చాలు అని చెప్పుకొచ్చాడు పాంటింగ్.
రిషభ్ పంత్ కు కారు ప్రమాదం జరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ ఎదుదెబ్బ తగిలింది. పంత్ గైర్హాజరీతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథ్యం ఎవరు వహిస్తారు అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన డేవిడ్ వార్నర్ పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ పాంటింగ్. తాజాగా ట్విటర్ లో బుమ్రా భార్య, ప్రెజంటేటర్ సంజనా గణేషన్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు పాంటింగ్.
పాంటింగ్ మాట్లాడుతూ..” పంత్ లాంటి వ్యక్తులను టీమ్ లో భర్తీ చేయలేం. ప్రస్తుతం మా ముందు ఉన్న పెద్ద సమస్య ఇదే. అయితే పంత్ ఫిట్ గా లేకపోయినా గానీ, అతడు మాతో వచ్చి మా పక్కన కూర్చుంటే మాకు కొండంత అండ. ఆ ధైర్యం మాకు చాలు. పంత్ డగౌట్ లో మా పక్కన కూర్చుని చిరునవ్వులు నవ్వుతుంటే మాకెంతో ఉత్సాహాం వస్తుంది. ఇక మార్చి నెలలో మా జట్టు క్యాంప్ ఏర్పాటు చేస్తోంది, అప్పటిలోగా పంత్ టీమ్ లో ఉంటాడు అని ఆశిస్తున్నాం” అంటూ పాంటింగ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి పంత్ పై పాంటింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ricky Ponting talking about Rishabh Pant – this is such a beautiful video.pic.twitter.com/XNl4Pd5AWs
— Johns. (@CricCrazyJohns) January 20, 2023