ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీ20ల్లో టాప్ 5 ఆటగాళ్లను ప్రకటించాడు. ఈ ఐదుగురిలో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు ఉండటం విశేషం. పైగా నంబర్ వన్ ప్లేయర్‌గా అఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌ను ప్రకటించిన పాంటింగ్ ఆశ్చర్యపరిచాడు. అలాగే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బిగ్ టీమ్స్ నుంచి కనీసం ఒక్క ప్లేయర్‌ను కూడా పాంటింగ్ తన టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్‌లో చోటు ఇవ్వలేదు. ఐసీసీ ర్యాకింగ్స్‌తో సంబంధం లేకుండా.. పాంటింగ్ తన పరిశీలన ఆధారంగా ఆటగాళ్లకు ర్యాంక్స్ ఇచ్చాడు. మరి ఆ టాప్ 5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1. రషీద్ ఖాన్ (అఫ్ఘనిస్థాన్)
అఫ్ఘనిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను టీ20ల్లో నంబర్ వన్ ప్లేయర్‌గా పాంటింగ్ పేర్కొన్నాడు. రషీద్ ఇప్పుడు కేవలం ఒక స్పిన్నర్ మాత్రమే కాదని.. పవర్ హిట్టింగ్ చేయగల ఆల్‌రౌండర్ అంటూ పాంటింగ్ కితాబిచ్చాడు. కాగా.. రషీద్ ఖాన్ ఇప్పటి వరకు 69 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 116 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో రషీద్ ఎకానమీ కేవలం 6.21 మాత్రమే. అలాగే నాలుగుసార్లు 4, రెండు సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ 238 పరుగులు ఉన్నాయి. 124.6 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్ 2022లో తన పవర్ హిట్టింగ్‌తో గుజరాత్ టైటాన్స్‌ను రెండు మ్యాచ్‌ల్లో సైతం గెలిపించాడు.
2. బాబర్ అజమ్ (పాకిస్థాన్)
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఆసియా కప్‌లో దారుణంగా విఫలం అవుతున్నా.. పాంటింగ్ తన టాప్ 5 టీ20 ఆటగాళ్ల లిస్ట్‌లో బాబర్‌కు చోటిచ్చాడు. ప్రస్తుతం బాబర్ టీ20, వన్డేల్లో ఐసీసీ నంబర్ వన్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 77 అంతర్జాతీయ టీ20లు ఆడిన బాబర్ 2719 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
3. హార్దిక్ పాండ్యా (ఇండియా)
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పాంటింగ్ తన టీ20 అత్యుత్తుమ ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానం ఇచ్చాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో పాండ్యా నంబర్ వన్ ఆల్‌రౌండర్ అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యా పూర్తిగా మారిపోయాడంటూ పాంటింగ్ వెల్లడించాడు. ఇక ఇప్పటి వరకు 69 అంతర్జాతీయ టీ20లు ఆడిన పాండ్యా 867 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అలాగే బౌలింగ్‌లో 54 వికెట్లు సైతం పడగొట్టాడు. ఆసియా కప్ 2022లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బౌలింగ్‌లో మూడు వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు.
4. జోస్ బట్లర్ (ఇంగ్లండ్)
ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, ఐపీఎల్ 2022లో ఏకంగా నాలుగు సెంచరీలో దుమ్మురేపిన జోస్ బట్లర్‌ను పాంటింగ్ టాప్ ఫోర్త్ టీ20 ప్లేయర్‌గా ప్రకటించాడు. బట్లర్ మ్యాచ్ విన్నర్ అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. హిట్టింగ్‌తో పాటు బట్లర్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయగలడని పాంటింగ్ కొనియాడాడు. ఇప్పటి వరకు 94 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 2227 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
5. జస్ప్రీత్ బుమ్రా (ఇండియా)
టీమిండియా బౌలింగ్ ఎటాక్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను టీ20 క్రికెట్‌లో టాప్ 5 ఆటగాడిగా పాంటింగ్ గుర్తించాడు. కొత్త బంతితో బుమ్రాను ఎదర్కొవడం అత్యంత కష్టమని పాంటింగ్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఇక ఇప్పటి వరకు 58 అంతర్జాతీయ టీ20లు ఆడిన బుమ్రా.. 69 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో బుమ్రా సైతం మంచి ఎకానమీ కలిగి ఉన్నాడు. టీ20ల్లో బుమ్రా ఎకానమీ 6.46గా ఉంది. మరి పాంటింగ్ ప్రకటించిన ఈ టాప్ 5 టీ20 ఆటగాళ్ల లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ధోని విషయంలో విరాట్ కోహ్లీ చెప్పిందంతా అబద్ధం: బీసీసీఐ అధికారి
Ricky Ponting’s first 5 players for the T20i World XI:
1. Rashid Khan.
2. Babar Azam.
3. Hardik Pandya.
4. Jos Buttler.
5. Jasprit Bumrah.— Mufaddal Vohra (@mufaddal_vohra) September 5, 2022
Former Australian skipper Ricky Ponting picks his top five current T20I batters.#CricTracker #Australia #T20Is #HardikPandya pic.twitter.com/V8oxCSaFUq
— CricTracker (@Cricketracker) September 5, 2022