‘2020 ఆగష్టు 15..’ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రోజుది. ఇది జరిగిన అనంతరం అందరి మదిలో మెదిలిన ఏకైక ప్రశ్న.. ధోనీ శిష్యుడు ఎవరా? అన్నది. మహేంద్రుడు.. కెప్టెన్ గా ఎంత విజయవంతమయ్యాడో.. కీపింగ్ గాను అంతే విజయవంతమయ్యాడు. రెప్పపాటు సమయం దొరికినా బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించేవాడు. అలాంటి మెలువకువలు కలిగిన మొనగాడు ఎవరా! అని ఆలోచిస్తున్న తరుణంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్, భవిష్యత్ ఆశాకిరణంలో కనిపించాడు. వెంటనే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడివరకు అన్నీ సవ్యంగానే ఉన్నా.. ఆశించిన మెరుపులు, మెళుకువలు పంత్ నుంచి కనిపించట్లేదే అన్నది అసలు సమస్య.
2017లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ కు జట్టులో ధోని ఉన్నన్నాళ్ళు పెద్దగా అవకాశాలు రాలేదు. ఏదో అడపాదడపా వచ్చినా.. వాటిల్లో విఫలమైనా.. పెద్దగా విమర్శలు రాలేదు. ఎందుకంటే.. ధోనికి విశ్రాంతి ఇచ్చిన మ్యాచుల్లో అవకాశాలు ఇస్తున్నారు కదా.. ఎలా రాణిస్తాడు అనేవారు. అయితే ధోనీ రిటైర్ అయ్యాక జట్టులో కీలక ఆటగాడు అయ్యాడు. ద్వైపాక్షిక సిరీస్ అయినా.. ఐసీసీ టోర్నీ అయినా జట్టులో పంత్ ఉండాల్సిందే అన్నట్లుగా మారింది. ఆనాటి నుంచి చివరగా న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి టీ20 వరకు 66 మ్యాచుల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఇన్ని మ్యాచులు ఆడినా అతని స్కోర్ వెయ్యి పరుగులు దాటలేదు. 22.43 సగటుతో 987 పరుగులు చేశాడు. అంటే మ్యాచుకు 15 పరుగులు. అదే రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్ చూస్తే.. 34.61 సగటుతో 98 మ్యాచుల్లో 2838 పరుగులు చేశాడు. అంటే అంతర్జాతీయ టీ20 క్రికెట్ సగటుతో పోలిస్తే 12 శాతం ఎక్కువ.
Rishabh pant in his T20I career. #RishabhPant #T20I #crickettwitter #Cricket pic.twitter.com/rwas3kGkuE
— RVCJ Sports (@RVCJ_Sports) November 22, 2022
ఇక్కడ పంత్ ఐపీఎల్ లో బాగా ఆడుతున్నాడు అని విమర్శించటలేము. దేశానికి ఆడుతున్నప్పుడు ఆ కసి, ఆ పట్టుదల ఎందుకు కనిపించట్లేదన్నదే మన ప్రశ్న. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న పంత్, టీ20ఫార్మాట్‌లో మాత్రం తన సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే 66 మ్యాచులు వృధా చేశాడంటూ అతని గణాంకాలను ఎత్తి చూపుతున్నారు. మాజీ ఆటగాళ్లు సైతం.. అతన్ని తప్పించి శాంసన్.. ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని సూచిస్తున్నారు. అలాగని ఈ విమర్శలతో పంత్ కృంగిపోయాడా! అంటే కాదు.. గతంలో పోలిస్తే 10 కిలోలు పైనే పెరిగి.. మనకు అలాంటివి వంట పట్టవ్ అన్నట్లుగా మారాడు. ఇది మనం చెప్తున్న మాట కాదు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఇంతకీ.. పంత్ జట్టులో ఉండాలా? వద్దా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
@mufaddal_vohra @CricCrazyJohns Describe Pant’s T20I career. Give me one reason how he should play in T20I team. How many more Trial matches need? #RishabhPantfailsagain #RishabhPant pic.twitter.com/Z5vfWhudQ7
— KD Yadav (@kdyaadav0) November 20, 2022