భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. మరో రెండు రోజుల్లో అంటే శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ కు భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరంగా ఉన్నారు. దీంతో వీరి స్థానాలను ఎవరెవరితో భర్తీ చేయనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే.. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్, మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇద్దరూ ఈ టూరుకు దూరంగా ఉండడంతో.. టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా, వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నారు. మరోవైపు హెడ్ కోచ్ రాహల్ ద్రావిడ్ కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మరో సారి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. అదే విధంగా తొలిసారి భారత టీ20 జట్టులో యువ ఆటగాడు శుబ్మాన్ గిల్ కు చోటుదక్కింది. దీంతో అతడు తుది జట్టులో ఉండడం, ఓపెనర్ గా రావడం ఖాయం. మరో ఓపెనర్ ఎవరన్నదే అంతుచిక్కని ప్రశ్న.
ఈ క్రమంలో మరో ఓపెనర్ గా సూర్య బరిలోకి దిగనున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే.. మునపటి సెహ్వాగ్ మెరుపులుమళ్లీ చూడొచ్చు. ఓపెనర్ గా సూర్యకు ఇది తొలిసారికాదు. ఈ ఏడాది వెస్టిండీస్ సిరీస్ లో రోహిత్ జోడిగా బరిలోకి దిగి పర్వాలేదనిపించాడు. దీంతో గిల్ కు జోడీగా సూర్యకుమార్ యాదవ్ ను పంపాలని టీమిండియా మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, నవంబర్ 18న వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరగనుంది.
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/కీపర్), ఇషాన్ కిషన్, శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
India Vs New Zealand promo. pic.twitter.com/zXntlbXq03
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2022