దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టీ20లో భారత జట్టు ప్రయోగాలు చేయనుందా అంటే.. అవుననే వార్తలు విపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆడనున్న చివరి టీ20 మ్యాచ్ ఇదే. ఈ మ్యాచులో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వానున్నారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్, విరాట్‌కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. అంతేకాదు.. ముక్కు నుంచి రక్తం కారడంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడిన రోహిత్ శర్మఆడేది కూడా అనుమానంగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గిన టీమిండియా ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు భారత జట్టు ఆడబోయే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే. ఈ సిరీస్ ముగిసిన ఒక తర్వాత(అక్టోబర్ 6న).. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే భారత జట్టు సభ్యులందరూ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లనున్నారు. దీంతో ప్రయాణానికి ముందు రోజు మ్యాచ్‌కి కీలక ప్లేయర్లు దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు, ఇండోర్‌లో జరిగే చివరి మ్యాచ్‌కి కేఎల్ రాహుల్, విరాట్‌కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ కి రెస్ట్ ఇవ్వాలని భావిస్తోందట.
Virat Kohli and KL Rahul rested for the 3rd T20. (Source – NDTV)
— Johns. (@CricCrazyJohns) October 3, 2022
సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యని ఇక నేరుగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలో దింపాలని చూస్తున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ప్రకటించాడు. దీంతో మూడో టీ20లో యాదవ్ ఆడడం అనుమానమే. అలాగే మాజీ సారధి కోహ్లీ కూడా ఇండోర్ టీ20లో ఆడడం లేదు. ఆసియా కప్ 2022 నుంచి వరుసగా మ్యాచులు ఆడుతున్న కోహ్లీకి ఇండోర్ టీ20లో విశ్రాంతినిచ్చింది టీం మేనేజ్‌మెంట్. ఇప్పుడు కేఎల్ రాహుల్ పేరు కూడా ఖరారైంది. ఇక రెండో టీ20లో కాస్త అసౌకర్యంగా కనిపించిన రోహిత్.. మూడో టీ20 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ రోహిత్ కూడా రెస్ట్ తీసుకుంటే ప్లేయింగ్ 11 ఎవరా అన్న సందేహాలు నెలకొంటున్నాయి. కాగా, టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 23న భారత్ తన తొలి మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.
Rohit Sharma wants Suryakumar Yadav to play directly on 23rd against PAK in the T20 World Cup. 😂#RohitSharma #SuryakumarYadav pic.twitter.com/l8t2AaBpAN
— Cricket.com (@weRcricket) October 3, 2022
రోహిత్ శర్మ(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, షాబాజ్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్/ఉమేష్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్.