భారత క్రికెటర్ రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్ గురుంచి శుభవార్త అందుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్.. ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజుల తర్వాత పంత్ ఇంటికి వెళ్లనున్నాడు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు, కుటుంబసభ్యులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించినట్లు సమాచారం.
న్యూఇయర్ వేడుకల కోసం రిషబ్ పంత్, డిసెంబర్ 31న ఉత్తరాఖండ్లోని తన ఇంటికి వెళ్తుండగా రూర్కెలా సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పంత్ కారు పూర్తిగా కాలిపోగా, అతడు అద్దాలు పగలకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ ప్రమాదంలో అతని నుదుటిపై, వీపుపై, మణికట్టుకు, మోకాలికి గాయాలైన సంగతి తెలిసిందే. మొదట స్థానికంగా ప్రథమ చికిత్స అందించి తర్వాత డెహ్రాడూన్ లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
Rishabh Pant is being airlifted from Dehradun to Mumbai for treatment of ligament tears.#RishabhPant #Pantpic.twitter.com/jxVBbo7Qi8
— Drink Cricket 🏏 (@Abdullah__Neaz) January 4, 2023
ఈమద్యనే పంత్ మోకాలికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అతడు వేగంగా కోలుకున్నట్లు సమాచారం. ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయట. పంత్ డిశ్చార్జ్ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు. పంత్ మొదటి సర్జరీ విజయవంతమైంది. ఈ వారంలో డిశ్చార్జ్ అవుతాడని వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పంత్, వచ్చే నెలలో మరోసారి హాస్పిటల్కు వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్లు పంత్కు మరో సర్జరీ చేయనున్నారు.అయితే, ఈ యాక్సిడెంట్ కారణంగా పంత్ దాదాపు ఈ ఏడాది పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. పంత్ త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..
Rishabh Pant Health Update: Rishabh Pant’s health improves, will be discharged from hospital this week https://t.co/qqwyvyspSX pic.twitter.com/UmxzkGbboQ
— CrickTale Official (@CricktaleO) January 30, 2023