టీ20 ప్రపంచ కప్ పోరు ముగిసింది. క్రికెట్ పుట్టినిళ్ళైన ఇంగ్లాండ్ రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది. ఇక టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ద్వైపాక్షిక సిరీసులపైన ద్రుష్టి పెట్టాయి. ఈ క్రమంలో భారత జట్టు నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్ తో తలపడాల్సివుంది. ఈ టూర్ లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న కె ఎల్ రాహుల్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టిని మనువాడనున్నట్లు సమాచారం.
లవ్ బర్డ్స్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఇప్పటికే పలు మార్లు కనిపించారు. తాజగా బయటకొస్తున్న విషయం ఏంటంటే.. వీరి ప్రేమకు పెద్దలు ఓకే చెప్పారట. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. వివాహం తర్వాత ఈ జంట కొత్త ఇంటికి మారనున్నారట. సమాచారం ప్రకారం.. ముంబైలోని పాలి హిల్‌లోని సంధు ప్యాలెస్‌లోని విలాసవంతమైన ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది.
ఇది పక్కనపెడితే.. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రాహుల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్(50),జింబాబ్వే(51)తో జరిగిన మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసినా.. కీలక మ్యాచుల్లో మాత్రం చేతులెత్తేశాడు. ఈ రెండు మ్యాచులు మినహాయిస్తే మిగిన నాలుగు మ్యాచుల్లో రాహుల్ చేసిన పరుగులు 27. పాకిస్తాన్ పై 4, నెదర్లాండ్స్ పై 9, సౌతాఫ్రికాపై 9, ఇంగ్లాండుపై 5.. ఇలా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. దీంతో రాహుల్ పై తీవ్ర విమర్శతోస్తున్నాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మనోడు మాత్రం ఇవేమీ పట్టనట్టు అతియా శెట్టితో పెళ్ళికి సిద్ధమవుతున్నాడు.
KL Rahul’s struggled with his timing in both the Asia Cup and the T20 World Cup, despite scoring three fifties against Afghanistan, Bangladesh and Zimbabwe. #T20WorldCup pic.twitter.com/SjEnNBNH8u
— Wisden India (@WisdenIndia) November 12, 2022