ICC World Cup 2023: ప్రపంచ క్రికెట్ లో రిచెస్ట్ బోర్డుగా చలామణి అవుతున్న భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి భారీ నష్టం వాటిల్లనుంది. దాదాపు రూ.955 కోట్ల మేర నష్టపోనుంది. కాకుంటే.. ఇది కేంద్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం కనుక పన్ను ఉపశమనం ఇవ్వకపోతే భారీ నష్టం తప్పదని బీసీసీఐ ఓ నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్(ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీయే బీసీసీఐకి భారీ నష్టాన్ని చేకూర్చేలా ఉంది. ఆ వివరాలు..
టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇలాంటి మేజర్ టోర్నీలను ఐసీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలను ఐసీసీ ఒక్కోసారి ఒక్కోదేశంలో నిర్వహిస్తూ ఉంటుంది. ఈ టోర్నీలను ఆయా దేశాలలో నిర్వహించే సమయంలో పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన భాద్యత ఆయా బోర్డులపై ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు కనుక పన్ను మినహాయింపు ఇవ్వకపోతే.. ఆ దేశాల బోర్డులే ఆ నష్టాన్ని భరించాలి. ఈ తిరకాసు అగ్రిమెంటే బీసీసీఐని నష్టాలపాలు చేస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్- నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగాల్సివుంది. ఈ వరల్డ్ కప్ ప్రసారాల ద్వారా సమకూరే ఆదాయంపై కేంద్రం ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వలేదు. వచ్చే ఆదాయంపై 21.84 శాతం పన్ను(సర్చార్జ్) విధించింది. ఇదే తుది నిర్ణయమైతే.. బీసీసీఐ రూ.995 కోట్లు ఐసీసీకి చెల్లించాల్సి ఉంటుంది.
అయితే.. ఈ పన్ను మినహాయింపు కోసం బీసీసీఐ ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతోంది. ప్రభుత్వం పన్ను శాతాన్ని 21.84 నుంచి 10.92 శాతానికి తగ్గించినా.. రూ.955 కోట్ల నుంచి రూ.430 కోట్లకు తగ్గి కాస్తయినా ఉపశమనం కలుగుతుంది. ఇలా మెగా టోర్నీలకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం ఇది రెండోసారి. 2016 భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ ఇలానే జరిగింది. అప్పుడు బీసీసీఐ రూ.193 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఆ కేసు గురించి బీసీసీఐ ఇంకా ఐసీసీ ట్రైబ్యునల్ లో పోరాడుతూనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ ద్వారా ఐసీసీకి దాదాపు రూ.4400 కోట్ల ఆదాయం సమకూరనుంది.
BCCI Could Lose Rs 955 Cr If Govt Doesn’t Exempt Tax On ICC For Hosting 2023 World Cup
— Pragativadi (@PragativadiNews) October 14, 2022