క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవి గాయాలు. ఈ గాయాల కారణంగానే జట్టు ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో ఇంటిబాట పడుతుంటాయి. బుమ్రా గాయం కారణంగా టీమిండియా బౌలింగ్ దళం ఎంత వీక్ అయ్యిందో మనందరం చూశాం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ పై బౌలింగ్ లో దారుణంగా విఫలం అయ్యి ఇంటిదారి పట్టింది భారత జట్టు. ఇక మన దాయాది దేశం పాక్ పరిస్థితితి కూడా ఇలాగే తయ్యారు అయ్యింది. కీలక ఫైనల్ మ్యాచ్ లో ఆ జట్టు స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు బౌలింగ్ వేయలేదు. దాంతో భారీ మూల్యాన్నే చెల్లించుకుంది పాకిస్థాన్. ఈ క్రమంలోనే మోకాలి గాయం మానక ముందే.. మరో సర్జరీ జరిగింది అఫ్రిదీకి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
షాహిన్ షా అఫ్రిదీ.. ప్రస్తుతం ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో టీ20 వరల్డ్ కప్ లో పాక్ ను ఫైనల్ దాక చేర్చాడు. ఇక ఫైనల్లో గాయపడక పోతే పాకిస్థాన్ ను గెలిపించేవాడే అని క్రీడా నిపుణులు చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా షాహీన్ అఫ్రిదీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. తన పేస్ తో, స్వింగ్ తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టగల నైపుణ్యం ఉన్న బౌలర్ అఫ్రిదీ. ఈ 22 సంవత్సరాల ఫాస్ట్ బౌలర్ మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు అనుకునే లోపలే మరో సారి ఆస్పత్రిలో చేరాడు షాహిన్ అఫ్రిదీ. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
Had an appendectomy today but Alhumdulillah feeling better. Remember me in your prayers. 🤲 pic.twitter.com/M70HWwl9Cn
— Shaheen Shah Afridi (@iShaheenAfridi) November 20, 2022
షాహీన్ షా అఫ్రిదీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చాడు.”ఈ రోజు నాకు అపెండిక్స్ సర్జరీ జరిగింది. ఆ అల్లా దయవల్ల నేను బాగానే ఉన్నాను. నా కోసం మీ ప్రార్థనలు కొనసాగించడి” అంటూ భావొద్వేగ పూరితంగా రాసుకొచ్చాడు. దానిని ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను జతచేశాడు. దాంతో ఇంగ్లాండ్ తో, న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు దూరం కానున్నాడు షాహిన్ అఫ్రిదీ.”షాహీన్ అఫ్రిదీకి అపెండిక్స్ ఆపరేషన్ అయ్యింది. అతడికి సుమారు ఆరువారాలు రెస్ట్ కావాలని వైద్యులు సూచించారు. దాంతో అతడు పూర్తిగా కోలుకునే వరకు క్రికెట్ కు దూరం కానున్నాడు” అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది.