టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా జరిగిన టీ20 సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 కూడా గెలవాల్సిందే గానీ, ఆఖరి నిమిషంలో సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవ్వడం ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. సూర్య కుమార్ యాదవ్ ఇంకో రెండు బంతులు అదనంగా క్రీజులో ఉన్నా భారత్ గెలిచేసేది. అయితే ఈ మాటలు ఇండియన్ ఫ్యాన్స్ చెప్తున్నవి కాదు.. ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్ అన్న మాటలు.
మ్యాచ్ అనంతరం అవార్డ్ ప్రదానంలో ఇంగ్లాండ్ బౌలర్ టోప్లీ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ ని ఆకాశానికి ఎత్తేశాడు. “సూర్యకుమార్ యాదవ్ ఆడిన తీరుకు టీమిండియానే గెలవాల్సింది. అతను ఆడిన విభిన్నమైన షాట్స్ నేను ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలోనే చూడలేదు. అలాంటి షాట్స్ ఎలా ఆడాడు అని ఇప్పటికీ నాకు అంతుచిక్కడం లేదు” అంటూ టోప్లీ అభిప్రాయపడ్డాడు.
Reece Topley said “The knock by Suryakumar Yadav deserves to be on the winning side, he played some amazing shots which I haven’t seen in cricket – I don’t know how he played that shots”. #INDvsENG #ENGvsIND #SuryakumarYadav
— Bibekananda Sahu (@IamBibeka) July 11, 2022
టోప్లీ మూడో మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ అందుకున్నాడు. “3 వికెట్లు పడగొట్టిన రీస్ టోప్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో అత్యుత్తమ బ్యాటర్లు.. కొందరు సెటిల్ అయ్యారు, ఇంకొంతం అయ్యేందుకు ప్రయత్నించారు. ఎలాంటి పరిస్థితిలోనైనా రన్స్ కట్టడి చేయాలి లేదా వికెట్లు తీయాలి ఇదే పాయింట్ నేను అకున్నాను” అంటూ టోప్లీ తన ప్రదర్శనపై స్పందించాడు.
Reece Topley was completely superb yesterday 👏#ENGvIND pic.twitter.com/KaBHvyRHJ7
— England’s Barmy Army (@TheBarmyArmy) July 11, 2022
ఇంక సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన విషయానికి వస్తే.. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టీ20ల్లో హెఎస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్ మన్‌ల మధ్య స్కోర్ వ్యత్యాసం విషయంలో సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 117 పరుగులు చేయగా సెకెండ్ టాప్ స్కోరర్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశాడు. వారి మధ్య వ్యత్యాసం 89 పరుగులు ఉండటం విశేషం. టోప్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.
“Speechless, I was just in awe.” 🤩
Player of the Match Reece Topley hails an incredible knock from Suryakumar Yadav 👏 pic.twitter.com/EwN1TFuoTR
— Sky Sports Cricket (@SkyCricket) July 10, 2022