దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లను ఓడిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కూడా ఓడింది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. మ్యాచ్ ఆరంభంలో భారత్ పట్టుసాధించినట్లు కనిపించింది.
మలాన్, డికాక్, మార్కరమ్ వికెట్లు త్వరగానే పడగొట్టిన భారత బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశ నుంచి 296 పరుగుల చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా, డస్సెన్ సెంచరీలతో చెలరేగి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల తేడాతో ఓడింది.
విఫలమైన బౌలర్లు..
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు మన బౌలర్లను చాలా సునాయసంగా ఎదుర్కొన్నారు. టీమిండియా కెప్టెన్ రాహుల్ కూడా జట్టు ఎంపికలో తప్పు చేసినట్లు కనిపించింది. భువనేశ్వర్ స్థానంలో సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సింది. అలాగే ఆల్ రౌండర్ స్థానంలో జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌కూ అసలు బౌలింగ్ ఇవ్వలేదు. కెప్టెన్‌గా ఇది రాహుల్ వైఫల్యాన్ని సూచిస్తుంది. స్లాగ్ ఓవర్లలో బౌలర్ల మార్పును, ప్రయోగించే విధానంలోనూ కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, శార్థుల్ ఠాకుర్ ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
మిడిల్డార్ దారుణ వైఫల్యం..
లక్ష్యఛేదనలో ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం 12 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఇద్దరు చక్కగా ఆడుతూ.. లక్ష్యం దిశగా వెళ్తున్నట్లు కనిపించారు.
కానీ ధావన్ 79 వ్యక్తిగత స్కోర్ వద్ద మహరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఒక చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఇక ఇక్కడి నుంచి భారత్ బ్యాటర్లు క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బౌలింగ్‌లో విఫలం అయినా శార్ధుల్ ఠాకుర్ బ్యాటింగ్‌లో రాణించాడు. చివర్లో హాఫ్ సెంచరీతో రాణించినా.. లక్ష్యం భారీగా పెరిగిపోయింది.
దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగుల చేసి 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శార్ధుల్ ఠాకుర్(50) పరుగులతో, బుమ్రా(14) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ ఓటమిలో బౌలింగ్, మిడిల్డార్ బ్యాటింగ్ వైఫల్యం ప్రధానంగా నిలిచాయి. రెండో వన్డేలో భారత్ లోపాలను సరిచేసుకోని సిరీస్‌ను సజీవంగా ఉంచుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయంది.
ఇదీ చదవండి: అశ్విన్ ను హగ్ చేసుకుని వదలని కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో