ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మరికొన్ని నెలల్లో భారత్ లోనే జరగనుంది. ఇలాంటి టైంలో కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్స్ కమ్ బ్యాక్ తో అదరగొడుతున్నారు. మరి వీళ్లు ఇలా సక్సెస్ కావడం వెనక ఎవరున్నారో తెలుసా?
టీమిండియాకు మంచి రోజులొచ్చేశాయి! మొన్నటివరకు మన క్రికెటర్ల ఫామ్ చూసి అందరూ భయపడ్డారు. ఎందుకంటే ఈ ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగబోతుంది. 2011లో మన దగ్గరే టోర్నీ జరిగితే కప్ కొట్టేశాం. కానీ గత కొన్నాళ్లుగా కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి క్రికెటర్లు కొన్నాళ్లపాటు ఫామ్ కోల్పోవడంతో అభిమానులు భయపడిన మాట వాస్తవమే. తాజాగా వాళ్లు అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చేశారు. అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఆకట్టుకుంటున్నారు. దీంతో వరల్డ్ కప్ లో విన్నింగ్ సీన్ ని టీమిండియా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే టైంలో క్రికెటర్లు కూడా వరల్డ్ కప్ కోసం మేం రెడీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరి కోహ్లీ-రాహుల్ సక్సెస్ వెనక శివయ్య ఉన్నాడని మీకేమైనా తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రికెటర్లు అనగానే లగ్జరీ లైఫ్ స్టెల్ తో రాయల్ గా బతుకుతారని చాలామంది అనుకుంటూ ఉంటారు. బహుశా పెళ్లి కాకముందు వరకు అలా ఉంటారేమో గానీ.. ఒక్కసారి వివాహ బంధంలోకి అడుగుపెడితే మాత్రం పూర్తిగా మారిపోతారు. క్రికెటర్లు మాత్రమే కాదు దాదాపు ఎవరైనా అంతే కదా! బంధాలతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీనే తీసుకోండి. కొన్నేళ్ల ముందు వరకు రఫ్ అండ్ టఫ్ గా ఉండేవాడు. పెళ్లి చేసుకుని, కూతురు పుట్టిన తర్వాత పూర్తిగా సాఫ్ట్ అయిపోయాడు. బ్యాటింగ్ లోనూ స్థిరత్వం పెరిగింది. 2019 నవంబరు తర్వాత నుంచి మాత్రం ఫామ్ కోల్పోయాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అంటే గతేడాది ఆసియాకప్ సందర్భంగా అదిరిపోయే లెవల్లో కమ్ బ్యాక్ ఇచ్చాడు.
గతేడాది ఆసియాకప్ నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 6 నెలల్లో 5 సెంచరీలు బాదాడు. అయితే వీటి వెనక కోహ్లీ చేసిన దైవ దర్శనాలు ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. ఈ మ్యాచ్ కి ముందు ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు కేఎల్ రాహుల్ సతీసమేతంగా ఇదే గుడిని దర్శించుకున్నాడు. కానీ చివరి రెండు టెస్టుల్లో రాహుల్ కి జట్టులో చోటు దక్కలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ఛాన్స్ దక్కింది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో రాహుల్ 75 పరుగులు చేసి జట్టు విజయానికి కారణమయ్యాడు. తనపై విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్ తో చెక్ పెట్టేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ, రాహుల్ పేర్లు కాదు.. మహాకాళేశ్వర టెంపుల్ లోని శివయ్య పేరు మార్మోగిపోతోంది. ఆ గుడికి చాలా మహత్యం ఉందని, పూజ చేస్తే సక్సెస్ పక్కా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.